• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
LIVE

Cyclone Jawad: ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న తుఫాను ప్రమాదం..భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరాంధ్రపై తుఫాను ముంచుకొస్తోంది. రాయలసీమ జిల్లాల్లో జరిగిన నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు ఉత్తరాంధ్రలో తుఫాను ముప్పు టెన్షన్ పుట్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్‌ తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

Cyclone Jawad live Updates in Telugu: Depression intensifies in to cyclonic storm, northern Andhra to witness heavy rains

శుక్రవారం సాయంత్రం నుంచే జవాద్ తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జవాద్ తుఫానుకు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం...

Newest First Oldest First
1:05 PM, 5 Dec
పశ్చిమ బెంగాల్
జవాద్ తుఫాన్ ప్రభావంతో కోల్‌కతలో ఈ తెల్లవారు జాము నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఇదే పరిస్థితి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. జవాద్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తీవ్రత పెరుగుతోంది.
12:32 PM, 5 Dec
ఆంధ్రప్రదేశ్
జవాద్ తుఫాన్ వల్ల విశాఖపట్నం వద్ద సముద్రం పోటెత్తుతోంది. ఫలితంగా రామకృష్ణా బీచ్ వద్ద పలు చోట్ల భూమి కోతకు గురైంది. కొన్ని చోట్ల భూమి కుంగిపోయింది. దీనితో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
12:03 PM, 5 Dec
ఒడిషా
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరిలో ఏకధాటిగా కురుస్తోన్న అతి భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జవాద్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ వర్షం, ఈదుగాలుల తీవ్రత అంతకంతకూ రెట్టింపు అవుతోంది. పూరీ వద్దే జవాద్ తుఫాన్ తీరం దాటనుంది.
8:48 AM, 5 Dec
ఒడిషా
జవాద్ తుఫాన్ ప్రభావం వల్ల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరిలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాలతో పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
8:34 AM, 5 Dec
పశ్చిమ బెంగాల్
జవాద్ తుఫాన్ ధాటికి దిఘా తీరం వద్ద అల్లకల్లోలంగా మారిన సముద్రం. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఒడిశాలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
8:30 AM, 5 Dec
ఒడిషా
జవాద్ తుఫాన్ వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాంలల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
9:07 PM, 4 Dec
పురీలో కొందరినీ షెల్టర్ హోంకు తరలింపు
5:12 PM, 4 Dec
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
5:12 PM, 4 Dec
తుఫాను తీవ్రత ఇంకా కోస్తాపై రేపు సాయంత్రం వరకు ఉంటుంది
5:11 PM, 4 Dec
గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు
5:11 PM, 4 Dec
దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం
5:11 PM, 4 Dec
జవోద్ మరింత బలహీనపడుతూ రేపు ఉత్తర ఈశాన్యదిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనం..
5:10 PM, 4 Dec
క్రమంగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం.
5:10 PM, 4 Dec
పూరికి దక్షిణ నైరుతిగా 390 కిమీ..పారాదీప్ కు 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై వుంది.
5:08 PM, 4 Dec
విశాఖకు తూర్పు ఆగ్నేయంగా210 కిమీ..గోపాల్ పూర్ కు దక్షిణంగా 320 కిమీ. దూరంలో కేంద్రీకృతం
5:07 PM, 4 Dec
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తరదిశగా కదులుతోన్న జవోద్ తుపాను.
4:12 PM, 4 Dec
జవాద్ తుఫాన్ నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేస్తూ మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపిన దక్షిణమధ్య రైల్వేస్
4:10 PM, 4 Dec
పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలో ప్రజలను అలర్ట్ చేస్తున్న పోలీసులు
4:09 PM, 4 Dec
జవాద్ తుఫాన్ నేపథ్యంలో 73 మంది గర్భిణీ స్త్రీలను వివిధ సీహెచ్‌సీలకు తరలించిన కేంద్రపార జిల్లా యంత్రాంగం
4:06 PM, 4 Dec
జవాద్ తుఫాను నేపథ్యంలో అల్లకల్లోలంగా మారిన పూరీ తీరం
2:28 PM, 4 Dec
జవాద్ తుఫాన్: ఉత్తర కోస్తాలో ఓ మోస్తారు వర్షాలు.తీరం వెంబడి గంటకు 70కి.మీ వేగంతో వీస్తున్న గాలులు
2:25 PM, 4 Dec
తుఫాన్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: మంత్రి బొత్స
10:28 AM, 4 Dec
కాకినాడ ఉప్పాడలో ముందుకు వచ్చిన సముద్రం
9:32 AM, 4 Dec
జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఒడిషా-ఆంధ్రప్రదేశ్‌లలో యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేసిన యూజీసీ
9:30 AM, 4 Dec
ఏపీలోని మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో జవాద్ తుఫాన్ దృష్ట్యా 11ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,6 కోస్ట్ గార్డ్,10 మెరైన్ పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి
9:28 AM, 4 Dec
జవాద్ తుఫాను హెచ్చరికలు: పూరి సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ హెచ్చరిక
9:06 AM, 4 Dec
ఒడిషా
జవాద్ తుఫాన్ తీరానికి దూసుకొస్తోన్న నేపథ్యంలో అల్లకల్లోలంగా మారిన పూరీ సముద్ర తీరం. ఎగిసి పడుతున్న అలలు. ఇప్పటికే మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు. సముద్రం వైపు ఎవరూ వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ.
7:55 AM, 4 Dec
ఆంధ్రప్రదేశ్
జవాద్ తుఫాన్ సహాయక, పునరావాస చర్యల కోసం 10 కోట్ల రూపాయలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రాణనష్టాన్ని నివారించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం. జిల్లా, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పని చేయాలంటూ సూచనలు.
7:41 AM, 4 Dec
ఆంధ్రప్రదేశ్
జవాద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చాలా చోట్ల 20 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన వాతావరణ కేంద్రం అధికారులు.
7:29 AM, 4 Dec
ఆంధ్రప్రదేశ్
జవాద్ తుఫాన్ వేగంగా కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాత్రి 11:30 గంటల సమయానికి అది బంగాళాఖాతంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాలోని పూరికి పశ్చిమ మధ్య దిశగా 430 కిలోమీటర్లు, పారాదీప్‌కు నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో అది తీరం వైపునకు కదులుతున్నట్లు తెలిపారు. క్రమంగా పూరీ వైపునకు దూసుకొస్తుందని, అనంతరం దక్షిణ పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తుందని పేర్కొన్నారు.
READ MORE

English summary
Cyclone Jawad is making its way towards Odisha and northern Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X