విజయ్ సీఎం కావడంతో షాకయ్యా..! స్టాలిన్ భేటీ వెనుక ? రజనీ షాకింగ్..!

తమిళనాడులో తాజాగా జరిగిన ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో తలైవా రజనీకాంత్ (rajinikanth) వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను కలిసిన రజనీ.. సీఎం అయిన విజయ్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినా దూరంగా వెళ్లిపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. విజయ్ పై అసూయ వల్లే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలపై ఇవాళ రజనీకాంత్ స్పందించారు.

ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన రజనీకాంత్..తాజా పరిణామాలపై వివరణ ఇచ్చారు. మౌనంగా ఉండటం వల్ల తప్పుడు కథనాలు వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఏర్పడుతుందని, అందుకే స్పందిస్తున్నట్లు తెలిపారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో తన పరిచయం రాజకీయాలకు అతీతమైందని రజినీకాంత్ తేల్చి చెప్పారు. ఎన్నికల తర్వాత స్టాలిన్‌ను కలుసుకోవడం వ్యక్తిగత స్నేహ బంధంలోని భాగమే తప్ప రాజకీయ కోణం కాదని ఆయన వివరించారు. స్టాలిన్ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. అనవసరమైన విషయాలపై చౌకబారుగా మాట్లాడే వ్యక్తి రజినీకాంత్ కాదన్నారు.

Thalaivar Speaks Out Rajinikanth Clears Air on Vijay Rivalry Calls Jealousy Buzz Baseless

టీవీకే అధినేత విజయ్ సీఎం అయిన విషయం వినగానే తాను "తీవ్రంగా షాక్ అయ్యానని" రజినీకాంత్ వెల్లడించారు. తాను రాజకీయాల్లో లేనని, రాజకీయాల నుంచి దూరమై చాలా కాలమైందని ఆయన గుర్తుచేశారు. తనకు, విజయ్‌కి మధ్య 28 ఏళ్ల వయసు తేడా ఉందని, విజయ్ రెండు ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా స్వతంత్రంగా నిలబడి గుర్తింపు పొందారన్నారు. ముఖ్యమంత్రిగా గెలుపు అనంతరం ఆయనకు తాను అభినందనలు తెలిపినట్లు రజనీ వివరించారు. తాను రాజకీయాల్లో లేనప్పుడు విజయ్ మీద తనకు ఎందుకు అసూయ ఉంటుందని రజనీ ప్రశ్నించారు. ఒకవేళ కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయి ఉంటే తనకు అసూయ వచ్చి ఉండేదేమో తెలీదన్నారు. అప్పుడు కూడా వచ్చి ఉండదన్నారు. తనను విజయ్ తో పోల్చుకుంటే అది తనకు మంచిది కాదని,విజయ్ ని తనతో పోల్చుకుంటే అది ఆయనకు మంచిది కాదని రజనీ నర్మగర్భ వ్యాఖ్యలు చేసారు. విజయ్ సీఎం అయినందుకు తనకు ఎందుకు అసూయ ఉంటుందన్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+