Bandi Bhageerath: నేరం ఒప్పుకున్న బండీ భగీరథ్..! లొంగిపోలేదా ? పోలీసుల కీలక ప్రకటన..!
మైనర్ బాలికకు మద్యం తాగించి లైంగిక దాడి చేసిన వ్యవహారంలో పోక్సో చట్టం కింద కేసు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhageerath) ఎట్టకేలకు నేరం అంగీకరించారు. కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి పోలీసులు బండి సంజయ్ ఇంట్లో సైతం తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్వయంగా తన కుమారుడిని పోలీసులకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం మంచిరేవుల టెక్ పార్క్ వద్ద బండి భగీరథ్ ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం భగీరథ్ ను కోర్టులో హాజరుపర్చి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ప్రకటించారు. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నామని, అనంతరం కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ కు కేసు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. తర్వాత పరారీలో ఉన్న నిందితుడి కోసం కరీంనగర్ తో పాటు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు గాలింపు బృందాల్ని పంపినట్లు తెలిపారు.

PRESS NOTE pic.twitter.com/SZAtAKyU4j
— Cyberabad Police (@cyberabadpolice) May 17, 2026
అలాగే విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత పోలీసు అకాడమీ దగ్గర నిందితుడు భగీరథ్ తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో నాకాబందీ నిర్వహించామన్నారు. ఈ క్రమంలోనే ఎస్వోటీ బృందం మంచిరేవుల టెక్ పార్క్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న రాత్రి 8.15కు సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారన్నారు. అక్కడ విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడన్నారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాక భగీరథ్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చామని తెలిపారు. అనంతరం రిమాండ్ విధించడంతో జ్యుడియషల్ కస్టడీకి (జైలుకు) తరలించామని వెల్లడించారు.














Click it and Unblock the Notifications