కేకేఆర్ ఎంట్రీతో అనూహ్య మలుపు: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ పదిలం కావాలంటే.. !!
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి. శనివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్ కత నైట్ రైడర్స్ చేతిలో 29 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఈ పరాజయంతో గుజరాత్ టైటాన్స్ కు పెద్దగా కోల్పోయిందేమీ లేదు గానీ కేకేఆర్ కు మాత్రం భారీ ఊరట ఇచ్చింది. ఈ గెలుపుతో తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. ఇదే ఊపుతో మిగిలిన రెండు మ్యాచ్ లనూ గెలిస్తే 15 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉంటుంది కూడా.
కోల్ కత నైట్ రైడర్స్ సాధించిన ఈ విజయం సన్ రైజర్స్ హైదరాబాద్ ను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టింది. 14 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉందీ జట్టు. కేకేఆర్ తో సమానంగా ఇంకో రెండు మ్యాచ్ లు మిగిలివున్నాయి. ఈ రెండింటినీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంటుంది సన్ రైజర్స్ కు. కేకేఆర్ కంటే ఎక్కువ పాయింట్లు సాధించాలీ అంటే ఒకదాంట్లో గెలిచినా సరిపోతుంది గానీ.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్ పోటీకి వస్తాయి. ఈ రెండు జట్లు కూడా ఇంకో రెండేసి మ్యాచ్ లను ఆడాల్సి ఉంది.

కేకేఆర్ సాధించిన ఈ విజయంతో ప్లేఆఫ్ రేసు అనూహ్య మలుపులు తిరిగింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ బెర్తుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 2019లో సన్ రైజర్స్ మాత్రమే 12 పాయింట్లతో అర్హత సాధించింది. 14 పాయింట్లు సాధించిన జట్లు అర్హతకు అంచున ఉంటాయి.
కేకేఆర్ గెలిచిన తర్వాత అందరి చూపూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పైనే పడింది. 12 మ్యాచ్‌లకు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచినప్పటికీ.. మిగిలిన రెండింట్లోనూ గెలిస్తే ఎటువంటి నెట్ రన్ రేట్ ఇబ్బందులు లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లుంది. గుజరాత్ టైటాన్స్‌తో ఓటమి కారణంగా ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.331కి తగ్గింది. టాప్-4 రేసులో కొనసాగడానికి మిగిలిన లీగ్ మ్యాచ్‌లలో విజయం సాధించడం వారికి అత్యంత కీలకం.
పంజాబ్ కింగ్స్.. ముంబై ఇండియన్స్‌తో ఓటమి తర్వాత ప్లేఆఫ్ రేసులో వెనక్కితగ్గింది. 12 మ్యాచ్‌లకు 13 పాయింట్లతో, +0.355 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో కనీసం ఒక విజయం తప్పనిసరి.












Click it and Unblock the Notifications