cyclone michaung: మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్- రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను దూసుకొస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్న మిచౌంగ్ తుపాను క్రమంగా ముందుకు సాగుతూ కృష్ణాజిల్లావైపు పయనిస్తోంది. ఈ నెల 5న అంటే ఎల్లుండి బందరు సమీపంలో తుపాను తీరం దాటే అవకాశముంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం జగన్ తుపానుపై సమీక్ష నిర్వహించడంతో పాటు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తుపాను సహాయక చర్యల కోసం జిల్లాల వారీగా నిధులు కూడా విడుదల చేశారు.
ఇదే క్రమంలో మిచౌంగ్ తుపాను తీరం దాటుతుందని భావిస్తున్న కృష్ణాజిల్లాకు పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోనూ అధికారులు అప్రమత్తం అయ్యారు. మిచౌంగ్ తుఫాను కారణంగా జిల్లా లో విస్తారంగా వర్షాలు ఈదురుగాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా జిల్లాలో పాఠశాలలకు సోమ, మంగళవారం రెండురోజులు సెలవు ప్రకటిస్తునట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు ప్రకటించారు. ఈ మేరకు స్కూళ్లకు ఉత్తర్వులు పంపుతున్నారు.

మిచౌంగ్ తుఫాన్ పై వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ముందు జాగ్రత్త చర్యలలో భాగం గా ఈ నెల 4 5 వ తేదీలు సోమ,మంగళ వారాలలో జిల్లా లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు మేనేజ్మెంట్ పాటశాలలకు సెలవు ప్రకటించినట్లుజిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు ప్రకటన లో తెలిపారు. కాబట్టి ఈ రెండు రోజులు అన్ని స్కూళ్లు మూసేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. తుపాను పరిస్ధితి దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications