cyclone michaung: మిచౌంగ్ తుఫాను దెబ్బ- ఏకంగా 140 రైళ్ల రద్దు.. వివరాలివే..
మిచౌంగ్ తుపాను దూసుకొస్తోంది. మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేలా ఉన్నాయి. దీంతో రైల్వే అప్రమత్తమైంది. మిచౌంగ్ తుపాను దృష్ట్యా 140 రైళ్లను ముందు జాగ్రత్తగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో వివిధ రూట్లలో ప్రయాణించే పలు సర్వీసులు ఉన్నాయి. దీంతో రేపు, ఎల్లుండి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఇప్పుడు తుపానుగా రూపాంతరం చెందుతోంది. రేపటి కల్లా ఇది పూర్తిస్దాయిలో తుపానుగా మారి భారీ వర్షాలు కురిసే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో ప్రజల్ని కూడా తుపాను బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇదే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కూడా భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

తుపాను కారణంగా పడే భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకూ 140 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఏపీలో ప్రయాణించే రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే రైళ్లు, అలాగే వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన రైళ్లు, ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లు ఇలా చాలా సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ రద్దు చేయడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
గతంలో జరిగిన రైలు ప్రమాదాల్ని దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే పరిస్ధితిని బట్టి రేపు, ఎల్లుండి మరిన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీడియాకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.












Click it and Unblock the Notifications