ఏపీలో బెంబేలెత్తించిన టోర్నడోలు: గాల్లో తేలిన వాహనాలు, కూలిన స్తంభాలు, చెట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కోస్తా ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు పంటలకు భారీ నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు జలమయమయ్యాయి. మరోవైపు, పలు ప్రాంతాల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి.

కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం మల్లేపల్లి శివారు జాతీయ రహదారి పక్కన పెట్రోల్‌ బంకు ఎదురుగా, సుడిగాలి పెద్దగా లేచింది. కొద్దిదూరం దూసుకెళ్లిన సుడిగాలి, స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఈ సుడిగాలిదాటికి రహదారిపై వెళ్తున్న ఆటోలు గాలికి కొట్టుకుపోయాయి. సుడిగాలి తమ వైపు వస్తుందంటూ పెట్రోల్ బంకులోని ఉద్యోగులు పరుగులు తీశారు.

cyclone michaung: tornado disaster in rajamahendravaram and other places in andhra pradesh

మరోవైపు, అన్నవరం రైల్వే గేటు వద్ద కూడా సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి దాటికి రైల్వే గేటు సమీపంలో ఆగి ఉన్న వాహనాలు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. సుడిగాలి దాటికి ఓ ఆటోతో పాటుగా, టాటాఏస్ వాహనం ఎగిరిపడ్డాయి. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. మరో చోట విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. భారీ వృక్షాలు నేల కూలాయి. రైల్వే గేట్ పక్కనే ఉన్న ఓ ఇంటి రేకులు సైతం సుడిగుండం ధాటికి కొట్టుకుపోయాయి. ఆ తర్వాత పంపా రిజర్వాయర్ వైపు కదలడంతో రిజర్వాయర్​లోని నీరు టోర్నడోతోపాటు పైకి వెళ్లింది.

ఇది ఇలావుంటే, తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. వై-జంక్షన్, వీ ఎల్ పురం, మోరంపూడి, హుకుంపేట, ప్రకాశంనగర్, దానవాయిపేట, ఆర్ట్స్ కళాశాల పరిసరాలు, వై జంక్షన్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో టోర్నడోలు కలకలం సృష్టించాయి. భారీ గాలులు వీయడంతో నివాసాలు, దుకాణాలపై ఉన్న రేకులు గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. గాలి వేగానికి దుకాణాల్లో వస్తువులు బయటకు ఎగిరిపడ్డాయి. పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి.

గాలి వేగానికి గోదావరిలో అలలు సముద్రం మాదిరి ఎగిసి పడ్డాయి. జనం ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వీరభద్రపురంలో కంటిపూడి రామారావు మున్సిపల్ పాఠశాలలో నాడు-నేడు పనుల్లో భాగంగా రెండవ అంతస్తు పైన వేసిన రేకుల షెడ్డు కింద పడింది. తుఫాను నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు మంజూరు చేయడంతో ప్రమాదం తప్పింది. ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు, సుడిగుండాలతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+