Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Montha Landfall:తీరం తాకిన మొంథా తుపాన్..! భారీ వర్షాలు మొదలు..!

ఏపీలోని దాదాపు ఏడు జిల్లాలపై ప్రభావం చూపుతున్న మొంథా తుపాను కొద్దిసేపటి క్రితం కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది. గత 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన ఈ తుపాన్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నంకి 220 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతం అయింది. ఈ తుపాను పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

కాకినాడ సమీపంలో రేపు తెల్లవారుజాముకల్లా తుపాను పూర్తిగా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రబావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.మరోవైపు తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో పరిస్ధితుల్ని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కోనసిమ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Cyclone Montha Makes Landfall Between Kakinada and Machilipatnam Heavy Rains Persist

ఇప్పటికే ఈదురుగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చి రేపు సాయంత్రం వరకు ఆశ్రయం కల్పించి రాత్రి భోజనం అనంతరం తిరిగి ప్రభుత్వం ప్రకటించిన రూ 3 వేల ఆర్థిక సహాయాన్ని, మత్స్యకార నిర్వాసితులకు ఉచితంగా 25 కేజీల బియ్యాన్ని అందించి ఇంటికి పంపించాలన్నారు. ప్రత్యేక అధికారులు జిల్లా కలెక్టర్ సూచనలతో జనరేటర్లు అవసరమైన చోట ఏర్పాటు చేసుకొని వాటికి అవసరమైన డీజిల్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Cyclone Montha Makes Landfall Between Kakinada and Machilipatnam Heavy Rains Persist

మరోవైపు తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు ఉంటాయన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయన్నారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని తెలిపింది. తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత ఇది క్రమంగా తెలంగాణవైపు వెళ్లి అక్కడి నుంచి ఛత్తీస్ ఘడ్ వైపు మరలే అవకాశం ఉందని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+