Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుధుద్ కంటే టిట్లి సైక్లోన్ ప్రభావమే ఎక్కువ, కానీ: 8 మంది మృతి, ఫోన్ నెంబర్లు ఇవే

Recommended Video

    హుధుద్ కంటే టిట్లి సైక్లోన్ ప్రభావమే ఎక్కువ

    శ్రీకాకుళం/విజయనగరం: టిట్లి తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగర్ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. చెట్లు, కరెంట్ స్తంభాలు, ఇళ్లు నేలకు ఒరిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ పని చేయలేదు. చెట్లు కూలడంతో రోడ్ నెట్ వర్క్ స్తంభించింది. టిట్లి తుఫాను కారణంగా 8 మంది మృతి చెందారు.

    శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. రెండువేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. పలు ప్రాంతాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల మొబైల్, ల్యాండ్ ఫోన్లు పని చేయలేదు. తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టిట్లి తుఫాను పెను విధ్వంసమే సృష్టించింది.

    టిట్లి తుఫాను కారణంగా 8 మంది మృతి

    టిట్లి తుఫాను కారణంగా 8 మంది మృతి

    టిట్లి తుఫాను కారణంగా 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు చనిపోయారు. ఇందులో సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు చనిపోయారు. ఇల్లు, చెట్లు నేలకు కూలడంతో ఒకరు మృతి చెందారు. రెండు బోట్లు సముద్రంలోనే చిక్కుకున్నాయి. బోట్లను ఓడ్డుకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

    బలమైన ఈదురు గాలులు, సహాయం కావాలంటే ఫోన్ నెంబర్లు ఇవే

    బలమైన ఈదురు గాలులు, సహాయం కావాలంటే ఫోన్ నెంబర్లు ఇవే

    టిట్లి ప్రభావంతో తీర ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వచ్చాయి. విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కళా వెంకట్రావు ఆదేశాలు జారీ చేసారు. ఈపీడీసీఎల్ పరిధిలో 1912 కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్పోరేట్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 8331018762. శ్రీకాకుళంలో విద్యుత్ సమస్యలపై 9490612633, 0894222736 ఫిర్యాదు చేయవచ్చు. విజయనగరంలో విద్యుత్ సమస్యలపై 94906-10102, 08922-22294 కు ఫిర్యాదు చేయవచ్చు. విశాఖపట్నంలో 7282299975, 0891 222942 ఫిర్యాదు చేయవచ్చు.

    హుధుత్ తుఫాను కంటే ఎక్కువ ప్రభావం కానీ

    హుధుత్ తుఫాను కంటే ఎక్కువ ప్రభావం కానీ

    టిట్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. నాలుగేళ్ల క్రితం నాటి హుధుద్ తుఫాను కంటే టిట్లీ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. హుధుద్ తుఫాను అనుభావాల నేపథ్యంలో అధికారులు ప్రాణనష్టాన్ని నివారించగలిగారని చెప్పారు. ఆస్తి నష్టం భారీగా జరిగిందన్నారు. వేలాది చెట్లు నేలకు ఒరిగాయన్నారు. ప్రకృతి విపత్తులను ఆపలేమని, ప్రభుత్వం తరఫున సరైన చర్యలు తీసుకొని కొంత నష్టాన్ని తగ్గించామని చెప్పారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.

    వర్షం భారీ వర్షం

    వర్షం భారీ వర్షం

    టిట్లి తుఫానుకారణంగా శ్రీకాకుళం జిల్లాలో గత రాత్రి గంట వ్యవధిలో 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం పడింది. వర్షాల ధాటికి రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. యశ్వంతాపూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్, బెంగళూరు - గౌహతి ఎక్స్‌ప్రెస్, యశ్వంతాపూర్ -ముజఫర్ ఎక్స్‌ప్రెస్, పూరీ, విశాఖ మధ్యల తిరిగే పలు ప్యాసింజర్లు రద్దయ్యాయి. విశాఖపట్నం -గుణపూర్ పాసింజర్‌ను విజయనగరం వరకు, విశాఖ - న్యూ పలాస పాసింజర్‌ను విజయనగరం వరకు మాత్రమే నడుపుతున్నట్లు తెలిపారు.

    హెచ్చరికలు ప్రమాద హెచ్చరికలు

    హెచ్చరికలు ప్రమాద హెచ్చరికలు


    టిట్లి తుఫాను గురువారం ఉదయం గం.4.30 నుంచి 5.00 మధ్య పలాస వద్ద తీరం దాటింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు కదిలి, క్రమేపి బలహీనపడి రేపటికి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటినా తర్వాత కూడా కొద్ది గంటలుశ్రీకాకుళం జిల్లాలో భారీ గాలులు వీస్తున్నాయి. కళింగపట్నంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ కొనసాగిస్తున్నారు.

    నదులకు వరద తాకిడి

    ఉద్ధానంను మినీ కోనసీమగా పిలుస్తారు. ఇక్కడ కొబ్బరి తోటలు, మామిడి తోటలు పెనుగాలులకు ఊగిపోయాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలాస, టెక్కలి ప్రాంతాల్లో బీభత్సవ దృశ్యాలు వణుకు పుట్టించేలా ఉన్నాయి. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వరద తాకిడి పెరగనుంది. తీర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి.

    అందుకే పెద్ద నష్టం తప్పింది

    టిట్లీ తుఫాను ప్రభావం 13 మండలాలపై ఉందని ఆర్జీటీ సెంటర్ సీఈవో వెల్లడించారు. గాలి వేగం 40 కిలో మీటర్లు తగ్గిందని తెలిపారు. గురువారం రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల పెద్ద నష్టం తప్పిందని అన్నారు. పెద్ద మొత్తంలో పంట నష్టం సంభవించిందని తెలిపారు.

    ఎన్డీఆర్‌ఎఫ్‌ను రంగంలోకి దింపిన కేంద్రం

    టిట్లి తుఫాను నేపథ్యంలో కేంద్రం 21 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని తీర ప్రాంతాల్లో భారీ ప్రభావం ఉండటంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎప్‌ను దింపింది. పశ్చిమ బెంగాల్లో కూడా దింపింది. ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్‌లను అప్రమత్తం చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+