మా అందరికీ అవమానం: బాబుకు చిరంజీవి, దాసరి 'తీవ్ర' హెచ్చరిక
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పళ్లం రాజు, వైసిపి నేత బొత్స సత్యనారాయణ తదితరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం నాడు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
కలెక్టర్, డీఐజీలు కాపు నేత ముద్రగడకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష చేసిన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా అమలు కాలేదని మండిపడ్డారు.

ఇప్పుడు దానిని పునరావృతం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హామీలను అమలు చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. కలెక్టర్, డిఐజీల ప్రకటనలకు విరుద్దంగా ముగ్గురు కాపు మంత్రులు ప్రకటన చేశారని వారు విమర్శించారు.
మంత్రుల ప్రకటన వెనుక విషపూరిత చర్య అన్నారు. ముద్రగడచే దీక్ష విరమింప చేసేందుకు చర్చలకు సిద్ధమని చెప్పిన ప్రభుత్వం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. ముద్రగడకు అవమానం జరిగితే కాపు జాతికి జరిగిన అవమానంగా భావిస్తామన్నారు.












Click it and Unblock the Notifications