సంవత్సరం వేరైనా రోజుల తేడా: అక్కినేని మృతిపై దాసరి

హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు కళ్లు వెళ్లిపోయాయని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు అన్నారు. అక్కినేని మృతదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సమయంలో దాసరి మాట్లాడారు. సంవత్సరాలు వేరైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు, అక్కినేనిలు నాలుగు రోజుల తేడాలోనే మృతి చెందారన్నారు.

ఆయనతో తాను 26 చిత్రాలు తీశానన్నారు. అక్కినేనితో, ఆయన కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధముందని చెప్పారు. సినీ పరిశ్రమకు రెండు కళ్లు పోయాయన్నారు. చిత్ర ధృవతారల్లో అక్కినేని ఒకరన దాసరి చెప్పారు.

Dasari Narayana Rao on Akkineni Nageswara Rao

రెండు కళ్లు పోయాయి: మోహన్ బాబు

చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేనిల మృతితో రెండు కళ్లు పోయినట్లయిందని మోహన్ బాబు అన్నారు. తాము తండ్రీ కొడుక్లలా ఉండేవారమన్నారు. ఆయన చిత్రాల్లో తాను విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా, కమేడియన్‌గా నటించానని చెప్పారు. ఆయన దగ్గర తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రెండు నెలల క్రితమే తాను ఆయనను కలిశానని చెప్పారు. అక్కినేని మహా నటుడు అన్నారు.

అక్కినేని మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రామానాయుడు అన్నారు. రెండు కళ్లు పోయినట్లయిందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. కాగా అక్కినేని మృతదేహానికి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+