ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ కు పాదాబివందనం, దాసరి సలహాతోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి

ఎన్ టి ఆర్ తో దర్శకరత్న దాసరినారాయణావు కేవలం ఐదు సినిమాలనే తీశారు. అయితే ఈ సినిమాలు ఎన్టీఆర్ కు ప్రజాభిమానాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లో రావడానికి కూడ ప్రధాన కారణంగా మారాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్ టి ఆర్ తో దర్శకరత్న దాసరినారాయణావు కేవలం ఐదు సినిమాలనే తీశారు. అయితే ఈ సినిమాలు ఎన్టీఆర్ కు ప్రజాభిమానాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లో రావడానికి కూడ ప్రధాన కారణంగా మారాయి.అయితే సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ కు దాసరి పాదాబివందనం చేశాడు.

సర్దార్ పాపారాయుడు సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఐటీలో చిత్రీకరించారు. ఫాగ్ ఎఫెక్ట్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఎన్టీఆర్ నడిచివస్తోంటే దాసరి నారాయణరావు ఒళ్ళు పులకరించిపోయింది.

Dasari Narayanarao advise to Ntr join in politics

షూటింగ్ నిలిపివేసిన వెంటనే దాసరి వెళ్ళి ఎన్టీఆర్ కు పాదాబివందనం చేశాడు. ఏమిటీ నారాయణరావు గారు అంటూ ఎన్టీఆర్ దాసరిని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ లో అల్లూరిని చూశానని అందుకే పాదాబివందనం చేసినట్టు దాసరి చెప్పాడు. ఆనాడు స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న మహనుభావుల గురించి ఇప్పుడు చెప్పుకొంటున్నాం. మన గురించి భావి తరాలు చర్చించుకొనే అవకాశం ఉంటుందా అని ఎన్టీఆర్ దాసరిని ప్రశ్నించారు.

ప్రజాసేవ చేస్తే ప్రజలు తప్పకుండా గుర్తుంచుకొంటారని దాసరి ఆయనకు సలహాఇచ్చారు. అదేరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ ప్రజాసేవకు సమయాన్ని కేటాయించనున్నట్టు ఆయన ప్రకటించారు.

English summary
Tollywood director Dasari Narayana Rao advise to Ntr join in politics,he verymuch like on former chiefminister, cine actor NTR.Dasari appreciated to him Alluri seetaramaraju getup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X