హైదరాబాదులో జగన్ పార్టీ సమైక్య శంఖారావం వెనక్కి!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపినప్పటికీ గడువు తక్కువగా ఉండటంతో సభ తేది వెనకకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జగన్ పార్టీ సభను మొదట ఈ నెల 19న నిర్వహించాలని భావించింది.
సభ కోసం వారు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు, ప్రభుత్వం నిరాకరించారు. బుధవారం హైకోర్టు వారి సభకు పచ్చజెండా ఊపింది. సభ మొదట అనుకున్న తేదీకి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సభ తేదీని కాస్త వెనకకు తీసుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.

సభ ఏర్పాటుకు కాస్త సమయం పడుతుందని, గడువు తక్కువ ఉండటంతో సభను మరో తేదీలో నిర్వహిస్తామని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పారు. సంబంధిత అధికారుల అనుమతితో తాము తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలోనే సభను నిర్వహిస్తామన్నారు.
సభకు కోర్టు అనుమతించినందున సంబంధిత అధికారులతో, పోలీసులతో మాట్లాడి 24న నిర్వహించాలనే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉంది. అయితే ఈ తేదీ ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. అయితే ఏర్పాట్ల కోసం సభను కాస్త 19 నుండి వెనక్కి జరపాలని ఆలోచిస్తోంది. 24వ తేదీ ఖరారయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications