ఆంధ్రాలో ముందుగా ఓట్లు వేసేది ఎంత మంది అంటే, డేట్లు కూడా ఫిక్స్, వారం ముందే చాన్స్!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులకు గుబులు మొదలైయ్యింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సందర్బంగా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 13వ తేదీన జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో 13వ తేదీ కంటే వారం రోజులు ముందుగానే వేలాది మంది ఓట్లు వెయ్యడానికి రంగం సిద్దం అవుతోంది.
ఎన్నికల విధులు నిర్వహించడానికి విధులకు వెలుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజు వారి సొంత ప్రాంతాల్లోని పోలింగ్ ప్రాంతాలకు వెళ్లి ఓటు వెయ్యడానికి అవకాశం ఉండదు. ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోనే 26, 498 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్దం అయ్యారు.

ఇప్పటికే తిరుపతి జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఈ ఉద్యోగులు అందరూ ఇప్పటికే బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల అధికారులు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగుల జాబితాను పంపించింది.
ఈనెల 5వ తేదీన పోలీసులకు, 6వ తేదీ, 7వ తేదీన ఇతర శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే అన్ని శాఖల ఉద్యోగులకు రెండు రోజులు అవకాశం ఇచ్చి పోలీసులకు మాత్రం ఒక్క రోజు అవకాశం ఇవ్వడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిద ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అధికారుల తీరుతో అసహనంగా ఉన్నారని తెలిసింది.
పోలీసు శాఖలో పని చేసే ఉద్యోగులు కేవలం ఒక్కరోజు మాత్రమే బ్యాలెట్ ద్వారా ఓటు వెయ్యడానికి ఇబ్బందులు వస్తాయని, రెండు రోజులు మాకు అవకాశం ఇవ్వాలని సంబంధిత అధికారులకు మనవి చేస్తున్నారు. అయితే పోలీసుల మనవిపై సంబంధిత అధికారులు ఎలా స్పాందిస్తారో ? వేచి చూడాలి అంటున్నారు కొందరు పోలీసులు. మొత్తం మీద మే 13వ తేదీ కంటే వారం రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉద్యోగులు వారి ఓటు హక్కను వినియోగించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications