తొలుత కూతురిపై, ఆ తర్వాత తల్లిపై గ్యాంగ్ రేప్
మెదక్: మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో దుండగులు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టారు గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
వివరాలు ఇలా ఉన్నాయి - రామక్కపేటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని దసరా వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి ఆమెను అపహరించారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

దాంతో ఆగకుండా ఆ తర్వాత దుండగులు విద్యార్థిని ఇంటికి వెళ్లి మీ కూతురు అక్కడ పడిపోయిందని తల్లికి సమాచారం అందించారు. దాంతో కంగారు పడిన ఆమె వారి వెంట వెళ్లింది. అక్కడ ఆమెపై కూడా దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
అర్థరాత్రి జరిగిన ఆ సంఘటనపై బాధితురాలు శనివారం ఉదయం గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications