వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర బంద్: బాబుకి జగన్ హెచ్చరిక, ఆమె కన్నీళ్లు తుడిచి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు నాలుగు రోజుల సమయం ఇచ్చారు. మున్సిపల్ కార్మికుల సమ్మె సమస్య పరిష్కారానికి ఏపీ సీఎంకు గడువు ఇచ్చారు. లేదంటే రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.

14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారని, ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వారితో అవసరం తీరాక కనీసం జీతాలు కూడా పెంచడం లేదన్నారు.

పుట్టపర్తిలో సమ్మె చేస్తూ మృతి చెందిన కార్మికుడికి పరిహారం ఇవ్వాలన్నారు. జగన్ అనంతలో రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు పలువురు మున్సిపల్ కార్మికులు తమ సమస్య పరిష్కారానికి కలిసి రావాలని కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నాలుగు రోజుల సమయం ఇస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్ గురువారంనాడు మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదా అని ఆయన అడిగారు. చంద్రబాబు ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఇస్తున్నామని, ఈలోగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్‌ చేపడుతామని ఆయన హెచ్చరించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

శుక్రవారం నాడు తలపెట్టిన మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుడు వెంకయ్య గుండెపోటుతో మరణించాడని ఆయన ఆరోపించారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

జీతాలు పెంచాలని అడిగితే ఉక్కుపాదంతో అణచేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

కార్మికుల వేతనాలు పెంచితే రూ. 200 కోట్ల నుంచి 300 కోట్ల భారం పడుతుందని ఆయన చెప్పారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నానరి ఆయన అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

సింగపూర్ బృందానికి ఎర్ర తివాచీ పరిచే చంద్రబాబుకు కార్మికుల సమస్యలు పట్టవా అని అడిగారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan reddy Rythu Bharosa Yatra on day 3rd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X