వైసీపీ లీడర్స్ కు నోరు ఎలా వస్తుందో తెలీదు, ఇంత కష్టపడుతుంటే ?, పవన్ కల్యాణ్

చంద్రబాబు నాయుడు ఓపిక చూస్తుంటే, ఆయన కష్టపడే తీరు చూస్తుంటే తనను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని, 25 ఏళ్ల యువకుడి కంటే చాలా చురుగ్గా మన సీఎం పనిచేస్తున్నారని, ఆయన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుతో కలిసి పని చెయ్యడం తనకు సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు.

మంగళగిరి లోనే ఏర్పాటుచేసిన ఎన్ డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చమని, కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అందరూ కష్టపడి పని చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.

DCM Pawan Kalyan said that he is surprised to see Chandrababu Naidu

పింఛన్ పెంచేందుకు ఖజానాలో డబ్బులు లేవని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచామని, సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు బురదలో దిగి నడుచుకుంటూ వరద బాధితుల దగ్గరికి వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని వారికి అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టం ఎలా ఉందో తెలుసుకోవడానికి భారీ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా ప్రజల మధ్యలో తిరిగారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇలా కష్టపడి పని చేస్తుంటే ఆయన్ను విమర్శించడానికి వైసీపీ నాయకులు నోరు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. విజయవాడలో వరద బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కలుసుకుని వారి కష్టాలు కళ్లారా చూశారని పవన్ కల్యాణ్ అన్నారు.

DCM Pawan Kalyan said that he is surprised to see Chandrababu Naidu

కాబట్టి వరత ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా కోలుకోవడానికి అధికారులు కూడా సరైన సమయంలో చర్యలు తీసుకున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పని చేసి విజయవాడను సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ శాఖ నిర్వీర్యం అయ్యిందని, అలాంటి పంచాయతీలను కాపాడటం కోసం గ్రామీణ ప్రజలను ఆదుకోవడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఆ శాఖకు రూ 1, 452 కోట్ల నిధులు ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ సర్పంచులు ఉన్న పంచాయతీలకు కూడా మేము నిధులు ఇస్తామని, ఎక్కడా ఎలాంటి తారతమ్యం చూపించమని, పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వం పని చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఈరోజు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల పేదలు, కార్మికుల కడుపు నిండుతోందని, అలాంటి అన్న క్యాంటీన్లను మూసివేయడానికి అప్పటి జగన్ ప్రభుత్వానికి మనసు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి పక్షాలు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+