ఎర్రచందనం అని వదిలేస్తామని అనుకోవద్దు, అంతు చూస్తాం, పవన్ కల్యాణ్ వార్నింగ్
స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏడుకొండలస్వామి కొలువు తీరిన తిరుమలగిరుల సమీపంలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువ అయ్యారని, వారి ఆగడాలకు త్వరలో చెక్ పెడుతామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టేస్తున్నారని, ఆ ఎర్రచందనం కర్ణాటకలో అమ్మేస్తున్నారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని దోచుకుంటున్న స్మగ్లర్లను ఎవరినీ వదిలిపెట్టమని, చట్టపరంగా అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంపదను దోచుకున్న అందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకువచ్చి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టిస్తున్నారని తమకు సమాచారం ఉందని ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని శేషాచలం అడవుల్లో స్పెషల్ ఫోర్స్ పోలీసులు, అటవీ శాఖ ఉద్యోగులతో ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొందరు వైసీపీ నాయకులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. అయితే ఎవరి పేర్లు ప్రస్తావించకుండా శేషాచలం ఎర్రచందనం స్మగర్లల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో ఇంతకాలం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన కొందరికి దడ మొదలైందని తెలిసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పదేపదే ప్రస్తావిస్తూనే ఉన్నారు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని వైసీపీకి చెందిన కొందరు నాయకులు స్మగ్లింగ్ చేశారని తిరుపతికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పదేపదే ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు అడ్డుకోవడానికి ప్రత్యేక ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతోందని తెలిసింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో నివాసం ఉంటున్న వారి సహకారంతో ఎర్రచందనం స్మగ్లర్లు లింక్ పెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications