చనిపోయాడని ఫిక్స్ అయ్యారు..! లేచి కూర్చోవడంతో అవాక్కయ్యారు

Subscribe to Oneindia Telugu

మునగపాక : చావు ఎవరికైనా విషాదమే.. అయితే సదరు వ్యక్తి చనిపోకముందే చనిపోయాడని భ్రమ పడడం మరింత విషాదం. విశాఖపట్నం జిల్లా మునగపాక మండల పరిధిలోని గవర్ల అనకాపల్లి గ్రామంలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

కాండ్రేగుల సీతారామ్ తీవ్ర అస్వస్థకు గురవడంతో.. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించారు కుటుంబ సభ్యులు. సీతారామ్ ను పరీక్షించిన సదరు వైద్యుడు సీతారామ్ అప్పటికే చనిపోయినట్లుగా నిర్దారించాడు. దీంతో సీతారామ్ ఇక లేడన్న షాక్ కు గురైన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరోవైపు అంత్యక్రియల ఏర్పాట్లు కూడా చేశారు బంధువులు.

Dead man surprises family in mungapaka

అయితే స్మశానానికి తరలించేందుకు సిద్దమవుతోన్న సమయంలోనే.. సీతారామ్ గుండె ఇంకా కొట్టుకుంటున్నట్లుగా గమనించాడు ఓ వ్యక్తి. దీంతో వెంటనే అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం సీతారామ్ ఒక్కసారిగా లేచి కూర్చుని, అంతకుముందులా మామూలుగానే మాట్లాడడం మొదలుపెట్టాడు.

చనిపోయాడనుకున్న సీతారామ్ ఇలా.. లేచి కూర్చోవడంతో షాక్ లొ ఉన్న కుటుంబ సభ్యులంతా తొలుత అవాక్కయినా, ఆ తర్వాత ప్రాణ గండం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Dead man surprised his family members in mungapaka. All the family members are fixed that he was died. But fortunately he was alive

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి