రామ్ చరణ్ IPL టీమ్ కొంటున్నారా?
నాలుగు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు నిహారిక సిద్ధమయ్యారు. కొత్త వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్స్'లో గాయత్రి అనే గేమర్ పాత్రలో ఆమె నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్, ఆన్‌లైన్ నెగెటివిటీ, వస్తున్న రూమర్స్ గురించి స్పందించారు.
ఆసక్తితోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టానని, సిల్వర్ స్క్రీన్, ఓటీటీ ఏదైనా వందశాతం కష్టపడే పనిచేస్తున్నానన్నారు. భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలొస్తే తప్పకుండా నటిస్తాననన్నారు. కొన్ని ప్రాజెక్టులు విడుదలయ్యాక తనని కలిసినవారు ఆ క్యారెక్టర్ తాను చేయననుకొని చెప్పలేదన్నారు. కానీ అటువంటి సందర్భాల్లో కొంత బాధపడ్డానన్నారు.

'డెడ్ పిక్సెల్స్' అంగీకరించడానికి ప్రధాన కారణం గాయత్రి పాత్ర అన్నారు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందని, ఈ పాత్రకోసం తాను ఎంతో కష్టపడ్డానన్నారు. సాధారణంగా తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని, కోపంలో తన హావభావాలు క్యూట్‌గా ఉంటాయన్నారు. గాయత్రి కొంచెం సీరియస్‌గా ఉంటుందని, కోపం వస్తే ఆమె హావభావాలు వేరేలా ఉంటాయన్నారు.
లాక్‌డౌన్‌లో పబ్‌జీ గేమ్‌కు తాను బాగా కనెక్ట్ అయ్యానని, చివరకు తనను ఎవరో చంపేస్తున్నట్లు కలలు కూడా వచ్చేవన్నారు. రెండుసార్లు ఫోన్ నుంచి దాన్ని తొలగించేశానన్నారు. తన సోదరుడు రామ్‌చరణ్ ఐపీఎల్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలపై నిహారిక స్పందించారు. ఏ టీమ్ కొంటున్నారని, హైదరాబాద్ టీమ్ కొంటున్నారా? అని అడిగారు. తనవరకైతే ఈ వార్త రాలేదని, ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత అన్నయ్యను అడుగుతానన్నారు.












Click it and Unblock the Notifications