గర్భవతిని చేసి మరో యువతితో పెళ్లి: శవానికి తాళి కట్టించాలని...
గుంటూరు: ప్రేమించానని నమ్మించి లోబరుచుకుని గర్భవతిని చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడో యువకుడు. దాన్ని జీర్ణించుకోలేక యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తన శవానికి తన ప్రేమికుడితో తాళి కట్టించాలని సూసైడ్ నోట్‌లో కోరింది.
తన శవానికి అతడితో తాళికట్టించి అంత్యక్రియలు జరిపించాలని సూసైడ్ నోట్‌లో యువతి కోరింది. గుంటూరు జిల్లాలో వారం రోజుల కింద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నిజాంపట్నానికి చెందిన కొక్కిలిగడ్డ జ్యోతి, బాపట్లకు చెందిన కూలర్ మెకానిక్ తన్నీరు బాల మురళీకృష్ణ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే 3 నెలల క్రితం మురళికృష్ణ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు

ఆ విషయం జ్యోతికి తెలిసే సరికి ఆమె 7 నెలల గర్భవతి. దీంతో వారం కిందట ఆమె తెనాలిలో అతడిని కలిసి మాట్లాడింది. జ్యోతి గర్భవతి కావడానికి తనకు సంబంధం లేదని మురళీ కృష్ణ చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బాలమురళీకృష్ణ ఇంటి వద్దకు వెళ్లి ఒం టిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆమెను జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. అయితే ఆమె మరణించడానికి ముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను కిరోసిన్ పోసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మురళీకృష్ణ తల్లి తనకు నిప్పంటించిందని ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఆమె రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను చనిపోతే మురళీతో తాళి కట్టించి అంత్యక్రియలు అతనితోనే జరిపించాలని జ్యోతి రాసినట్లు తెలిపారు. మురళీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications