వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీలర్ ఆత్మహత్య: టిడిపి నేతలు, ఆపీసర్ల వేధింపులే?

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ డీలర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకున్నది. పట్టణంలో మధుబాబు(40) 65వ నెంబరు రేషన్‌షాప్ నిర్వహిస్తున్నాడు.

ప్రభుత్వం మారిన తర్వాత స్టోర్ డీలర్లను తొలగించి టీడీపీ అనుకూలంగా వ్యవహరించే వారికి కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండుసార్లు రెవెన్యూ అధికారులు స్టోర్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే మధుబాబు వదలకుండా కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన రెవెన్యూ అధికారులు మధుబాబుని వేధింపులకు గురిచేశారు.

Dealer commits suicide allegedly harassed by TDP

కోర్టు ఖర్చులు, అధికారులకు లంచా లు చెల్లించి తీవ్రంగా నష్టపోయాడు. కలత చెందిన మధుబాబు ఉదయం రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగ్రహించిన స్థానికులు మృతుని కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. మధుబాబు ఆత్మహత్యకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని, టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

English summary
A dealer Madhubabu has commited suicide due to allegedly harassed by Telugudesam leaders and officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X