లేదు, ఎసరు పెట్టొద్దు: బిజెపి - టిడిపి పొత్తుపై లాబీల్లో

Debate on BJP - TDP tie up issue in Assembly lobby
హైదరాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రాంత భారతీయ జనతా పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపితో పొత్తును తెలంగాణ బిజెపి నేతలు కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దీనిపై గురువారం తన వ్యతిరేకతను ప్రదర్శించారు.

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వెంట బిజెపి వెళితే, కేంద్రంలో తమ పార్టీ వెంట తెరాస వస్తుందన్నారు. తెలంగాణలో గులాబీ వెంట కమలం వెళితే సింహభాగం లోక్‌సభ స్థానాల్లో బిజెపి, అసెంబ్లీ స్థానాల్లో తెరాస పోటీ చేస్తుందన్నారు. రెండు కేంద్ర మంత్రి పదవులు తెరాసకు దక్కుతాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని తెరాస వాళ్లే అంటున్నారన్నారు. పొత్తు కాకుండా తెలంగాణలో తెరాస, బిజెపి, సిపిఐ, న్యూడెమోక్రసీ అవగాహనతో ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన చర్చలో ఉందన్నారు.

కమ్యూనిస్టులు పోటీ చేసిన దగ్గర బిజెపి పోటీ చేయదని, చివరికి ఏ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇవన్నీ కెసిఆర్ ముందున్న ఆప్షన్లన్నారు. ఏ స్వీట్ తింటారనేది ఆయనిష్టమన్నారు. ఇప్పుడు స్వీట్‌గా ఉందనుకున్నది తర్వాత వగరు కావచ్చని వ్యాఖ్యానించారు.

సీటుకు ఎసరు పెట్టకండి

బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, టిడిపి సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బిజెపితో పొత్తు అంశాన్ని పయ్యావుల పరోక్షంగా ప్రస్తావించారు. తన సీటుకు ఎసరు పెట్టొదని చెప్పాగా నాగం నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. కాగా, జగన్ పార్టీ శాసన సభ్యులు క్యాలీఫ్లవర్లు పట్టుకొని అసెంబ్లీకి రావడంపై నాగం స్పందిస్తూ... వాటిని ఎవరి చెవుల్లో పెడతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+