రూ.50 వేల అప్పు..ఇంత మంది చావుకు కారణం అయ్యిందా..?
అప్పు చేసి పప్పు కూడు అనే సామెత వినే ఉంటాం. కానీ ప్రస్తుతం ఈరోజుల్లో అప్పు తీసుకోవడం అనే మాట పక్కన పెడితే ఇవ్వడం పెద్ద పాపం అవుతుంది అనే అనుమానం అందరికీ కలుగుతుంది. ఒకప్పుడు అప్పు ఇస్తే తీసుకున్నవారికి భయం ఉండేది. వడ్డీ ఎంత అవుతుంది.. తిరిగి కట్టక పోతే పరువు పోతుంది అని.. కానీ రోజులు మారాయో.. మనుషులు మారారో అని తెలియట్లేదు కానీ అప్పు ఇస్తే తిరిగి రాదు అని ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు. అలా అని అందరూ అంతే ఉంటారనడం కాదు కానీ ఎక్కువ శాతం ఈ తరహా ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అయితే రూ.50 వేలు అప్పు కారణంగా ఇద్దరు చనిపోయి.. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే..?
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాసరావు.. అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లకు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే రోజులు గడిచినా కానీ అప్పు చెల్లించకపోవడంతో ఇరువురి మధ్య కాస్త దూరం పెరిగింది. దాంతో కొన్ని రోజులుగా వెంకటేశ్వర్లు ముఖం చాటేస్తు తిరుగుతున్నాడు.

ఈ క్రమంలో గత మంగళవారం నాడు వెంటేశ్వర్లు ఇంటి వద్దకు శ్రీనివాసరావు భార్య పూర్ణ కుమారి, కుమారుడు వెంకటేశ్ వెళ్లి అప్పు చెల్లించాలని నిలదీశారు. దాంతో అప్పు చెల్లించలేనంటూ వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా జరిగిన విషయాన్ని పూర్ణకుమారి ఇంటికి వచ్చి విషయాన్ని భర్త శ్రీనివాసరావుకు తెలిపింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు ప్రాణాలకు ముప్పు ఉంటుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు పురుగుల మందు తాగాడు.
ఈ అనూహ్య పరిణామంతో ఆయన భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో పూర్ణకుమారి మృతదేహం లభ్యం కాగా కుమారుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పు వ్యవహారంలో రెండు కుటుంబాలకు ఈ దుస్థితి రావడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications