ఆ సర్వేతో చంద్రబాబులో తీవ్రనిరాశ; లోకేష్ కు ఫ్రస్ట్రేషన్!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా టైమ్స్ నౌ, నవభారత్ సర్వే లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తేలటంతో, తెలుగుదేశం పార్టీ బలం ఎంతో తెలిసిపోయిందని పేర్కొన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆ సర్వే ఫలితాలు ఇచ్చిన షాక్ తో చంద్రబాబు తీవ్ర నిరాశా, నిస్పృహల్లో కి వెళ్లిపోయారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ నేతలకు ఆ సర్వే దెబ్బకు వణుకు పుడుతుందన్నారు. తనకు ప్రజాదరణ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ పై ఆశలు పెట్టుకున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. లోకేష్ ను వదిలేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఆశలు పెట్టుకోవడం వల్ల, లోకేష్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఆయన అన్నారు.

ఫ్రస్ట్రేషన్ లో లోకేష్ పిచ్చి కూతలు కూస్తున్నాడు అని, ఇక ఆ కోపాన్ని వైఎస్ఆర్సీపీ నేతలపై చూపిస్తున్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ తో కలిసి లోకేష్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని, అందుకే లోకేష్ అభద్రతాభావం లో ఉన్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అసలు లోకేష్ పాదయాత్రను చంద్రబాబే లైట్ తీసుకున్నారని విమర్శించారు.
తాత నే వెన్నుపోటు పొడిచిన తండ్రికి తాను ఒక లెక్కనా అంటూ లోకేష్ భయపడుతున్నారని పేర్కొన్నారు. ఏదో ఒకటి మాట్లాడితే మీడియాలో చూపిస్తారని లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దత్త పుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ సభలకు ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వాలని అనుకూల మీడియా తో చెబుతూ కొడుకును పట్టించుకోవడంలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలు అందుకుంటున్నారని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సుపరిపాలన ఆదరిస్తున్న ప్రజలు, మరోమారు చంద్రబాబుని తరిమి కొట్టడం ఖాయమని, అనేక సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడి చేస్తున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications