వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్జీవోలపై ఢిల్లీ పోలీస్ ఆరా, ఫుడ్ లారీలకు టి ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi Police enquiring on Chalo Delhi programme
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వెళ్తున్న ఎపిఎన్జీవోలు, సమైక్యవాదుల పైన ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు, ఎక్కడకు వస్తున్నారు, వస్తున్న వారిలో కీలక వ్యక్తులు ఎవరు, గతంలో వారు ఎపీలో వ్యవహరించిన తీరు ఏమిటి తదితర అంశాల పైన సీమాంధ్ర జిల్లాల ఎస్పీల నుండి ఆరా తీస్తున్నారు. రైళ్లలో ఎపిఎన్జీవోలు ఢిల్లీకి తరలి వెళ్తున్న విషయం తెలిసిందే. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది.

అంతకుముందు ఢిల్లీకి వెళ్తున్న ఎపిఎన్జీవోలు, సమైక్యవాదులకు ఫలహారం, భోజనం, వంటవాళ్లను తీసుకెళ్తున్న లారీలను తెలంగాణవాదులు అడ్డగించారు. అదిలాబాద్ చెక్ పోస్టు వద్ద లారీలను అడ్డుకున్నారు. దీంతో రైళ్లలో ఉన్న ఎపిఎన్జీవోలు తిండి లేక అలమటించారు. వారికి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు మరో ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర నేతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

ఆహారం, వంటవాళ్లను తీసుకెళ్తున్న లారీలను తెలంగాణవాదులు అదిలాబాదు చెక్ పోస్టు వద్ద శనివారం రాత్రి అడ్డగించినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ నుండి అనుమతి పత్రాలు, ఆర్సీ బుక్స్, ఫోన్స్ తీసుకున్నట్లుగా సమాచారం. దీంతో సమాచారం కూడా చేరవేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారిని ఆదివారం ఉదయం వదిలేశారు.

మరోవైపు, మహబూబ్ నగర్ జిల్లా గద్వాల రైల్వే స్టేషననులో శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వుకున్నారు. ఛలో ఢిల్లీ కోసం బయలుదేరిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల ప్ర్తయేక రైలు రాత్రి ఎనిమిది గంటలకు క్రాసింగ్ ఉండటం వల్ల గద్వాల స్టేషననులో ఆగింది. ఈ సమయంలో రైలులో ఉన్న కార్యకర్తలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. వారిని చూసి స్టేషన్లో ఉన్న ప్రయాణీకులు జై తెలంగాణ అన్నారు. అనంతరం రాళ్ల దాడి జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X