టీ నేతలకు డిమిలిటేషన్ వర్రీ: జైపాల్ రెడ్డే దిక్కు

Jaipal Reddy
హైదరాబాద్‌: కాంగ్రెసు తెలంగాణ నేతలకు నియోజకవర్గాల డిలిమిటేషన్ భయం పట్టుకుంది. తెలంగాణలోని నియోజకవర్గాల డిమిలిటేషన్ అనే ప్రక్రియను కేంద్రం ప్రభుత్వం చేపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత దాని వల్ల నియోజకవర్గాల రూపురేఖలు పెద్ద యెత్తున మారిపోయే అవకాశం ఉంది.

కాగా, డిలిమిటేషన్ వల్ల హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 14 నుంచి 18కి పెరగవచ్చునని భావిస్తున్నారు. సీమాంధ్ర నుంచి వలస వచ్చినవారు రంగారెడ్డి జిల్లాలో పెద్ద యెత్తున ఉన్నారు. దీంతో సీమాంధ్ర నాయకులకు ఇది ఉపయోగపడవచ్చునని భావిస్తున్నారు.

ఇదిలావుంటే, హైదరాబాదులో రెవెన్యూ జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య 15 నుంచి 14కు తగ్గుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గం పెరుగుతుందని భావిస్తున్నారు. ఆ మేరకు అవశేషాంధ్ర ప్రదేశ్‌లో ఓ సీటు తగ్గుతుంది. డిలిమిటేషన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగకుండా చూడాలని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరనున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది.

లోకసభ ఎన్నికలతో పాటు విభజన తర్వాత ఏర్పడే రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా జరిగేలా చూడాలని జైపాల్ రెడ్డి సూచించనున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తే విభజన ఫలితాలు పార్టీకి దక్కకుండా పోతాయని కాంగ్రెసు తెలంగాణ నేతలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+