అమరావతి వర్శిటీల్లో స్థానికులకు సీట్లు, రాయితీలు-కొత్త డిమాండ్..!
ఏపీ రాజధాని అమరావతిలో కొత్త డిమాండ్లు ఊపిరిపోసుకుంటున్నాయి. అమరావతి రాజధానిని వేగంగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం స్థానికంగా ప్రైవేటు సంస్థలకు తక్కువ రేట్లకే భూములిస్తోంది. వీటిని తీసుకుని వారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే దీని వల్ల స్థానికంగా ఉండే విద్యార్ధులకు ఎలాంటి ప్రయోజనం లేదని, స్థానికులకు సీట్ల కేటాయింపు కానీ, ఫీజుల్లో రాయితీ ఇవ్వడం కానీ చేయకపోవడంపై అమరావతి ప్రజలు మండిపడుతున్నారు.
అమరావతి రాజధానిలో ఉన్న ప్రైవేటు యూనివర్శిటీల్లో స్థానిక, సీఆర్డీఏ పరిధిలోని విద్యార్ధులకు ఫీజుల్లో, ఇతర సౌకర్యాలలో రాయితీలు కల్పించాలని, ల్యాండ్ ఫూలింగ్ చట్టం ప్రకారం ఉచిత విద్య, వైద్యం అందించాలని, ప్రభుత్వం ద్వారా రాయితీ వల్ల భూములు పొందిన విద్యాసంస్థలలో ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటికి మళ్ళీ భూములు కేటాయించడం సరికాదని సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు తెలిపారు.

రాజధాని అమరావతిలో ప్రైవేటు యూనివర్శిటీలు విట్, ఎస్.ఆర్.ఎమ్ లకు అదనంగా చెరో 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఈ నెల 25న ఇచ్చిన జీవోపై ఆయన ఫైర్ అయ్యారు. గతంలో 2016లో కూడా 100 ఎకరాలు కేటాయించారని, సుమారుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 30వేల మందికి పైగా విద్యార్ధులు రాజధానిలోని యూనివర్శిటీలలో విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమరావతిలో ఆర్ధిక కార్యకలాపాల కోసం, విద్యా, వైద్య సౌకర్యాల కోసం ఈ యూనివర్శిటీలకు తక్కువ రేట్లకి భూములు ఇచ్చారన్నారు.
10వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని గతంతో నామమాత్రంగా ఎకరానికి 50లక్షలు, ఇప్పుడు 2కోట్ల విలువకు ఈ యూనివర్శిటీలకు కేటాయించారని, ప్రభుత్వానికి రెండు దశల్లో 500కోట్ల రూపాయలు ఈ భూముల మీద వస్తున్నాయని ఆయన తెలిపారు. ఒక వైపున రాజధానికి డబ్బులు లేవంటూ, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా 4కోట్లు వరకు ధర నిర్ణయించి, ఈ వర్శిటీలకు మాత్రం తక్కువకే కేటాయించారని ఆక్షేపించారు. ప్రభుత్వ రాయితీలతో భూములు ఇస్తున్నప్పుడు ఆ రాయితీలు విద్యార్ధులకు, ప్రజలకు దక్కాలన్నారు.

ప్రభుత్వం ద్వారా వేల కోట్ల రూపాయలు లబ్దిచేకూర్చుతున్నప్పుడు ఆ లబ్ది విద్యాసంస్థలు కోట్ల రూపాయలు అర్జించడం కాకుండా ప్రజలకు ఉపయోగపడాలని సిపియం డిమాండ్ చేసింది. ముఖ్యంగా రాజధానికి 34వేల ఎకరాల భూములిచ్చిన రైతులు, పనులు కోల్పోయిన కూలీలు ఉన్నారని, అందుకే ఈ విద్యాసంస్థలన్నింటిలో రాజధానిలో ఉన్న స్థానిక విద్యార్ధులకు ఫీజులలో రాయితీ ఇవ్వాలని, సీఆర్డీఏ పరిధిలోని 56 మండలాలలోని విద్యార్ధులకు కూడా ఫీజులు, ఇతర సౌకర్యాలలో రాయితీలు కల్పించాలన్నారు. మరో వైపు రాష్ట్రంలో ఉండే మెరిట్ విద్యార్ధులు, సామాజిక తరగతికి చెందిన బలహీన వర్గాల విద్యార్ధులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు ఈ విద్యాసంస్థల్లో కూడా అమలు అయ్యే విధంగా చూడాలన్నారు.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications