అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాత్కాలిక సచివాలయం: ఏ బిల్డింగ్‌లో ఏ కార్యాలయం?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం ప్రారంభానికి ఏపీ ప్రభుత్వం ముహుర్తాన్ని ఖరారు చేసింది. బుధవారం మధ్యాహ్నాం 2.59 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.

వెలగపూడికి వెళ్లే శాఖలపై చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ సోమవారం అధికారులతో సమీక్షి నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి ఏపీ సచివాలయ తరలింపును నాలుగు దశల్లో పూర్తి చేయాలని తన కార్యాలయంలో అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 29వ తేదీన ప్రారంభించి జూలై 21 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. మొదటి దశలో 29వ తేదీన వైద్య, ఆరోగ్య శాఖ, కార్మిక శాఖ, గృహనిర్మాణ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు వెళ్లనున్నాయి. ఈ నాలుగు శాఖలు ఐదో బ్లాకులోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో కొలువు దీరనున్నాయి.

Department wise floors allocated in ap temporary secretariat

జూలై 6న రవాణా శాఖ, రోడ్లు-భవనాలు శాఖ, విజిలెన్స శాఖ, ప్రణాళికా శాఖలు వెళ్లనున్నాయి. ఈ మేరకు ప్రణాళికా శాఖ అధికారులు సోమవారం రాజధాని ప్రాంత పర్యటనకు వెళ్లారు. ఈ శాఖలు కూడా ఐదో బ్లాకు నుంచే విధులు నిర్వర్తించనున్నాయి. మూడో దశలో భాగంగా జూలై 15న మరికొన్ని శాఖలు వెళ్లనున్నాయి.

ఈ శాఖలు మిగిలిన 4 బ్లాకుల్లోని గ్రౌండ్‌ఫ్లోర్ల నుంచి విధులు నిర్వహిస్తాయి. చివరిగా జూలై 21 వెళ్లే శాఖలు ఈ 4 బ్లాకుల్లోని మొదటి అంతస్తులో కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో తాత్కాలకి సచివాలంయలోని ఐదోవ బ్లాక్‌లో శాఖలకు కార్యాలయాలకు కేటాయింపులు జరిగాయి.

ఏ భవనంలోని ఏ అంతస్తులో ఏ ఆఫీసు ఉండాలో నిర్ణయిస్తూ తుది ప్రణాళిక ఖరారు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి:

మొదటి బ్లాక్:
ఫస్ట్‌ ఫ్లోర్‌: సీఎం కార్యాలయం, సీఎస్‌ ఆఫీసు.
గ్రౌండ్‌ ఫ్లోర్‌: జీఏడీ, న్యాయ శాఖ, సీఎం రిడ్రెసల్‌ హాల్‌.

రెండో బ్లాక్:
ఫస్ట్‌ ఫ్లోర్‌: ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ.
గ్రౌండ్‌ ఫ్లోర్‌: పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డిపార్ట్‌మెంట్‌, ఇంధన - మౌలిక సదుపాయాలు, పెట్టబడుల శాఖ; హోంశాఖ, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్

Department wise floors allocated in ap temporary secretariat

మూడవ బ్లాక్:
ఫస్ట్‌ ఫ్లోర్‌: సాంఘిక సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, బీసీ సంక్షేమం, మహిళ శిశు వికలాంగుల సంక్షేమ శాఖ, యువజన వికాసం - పర్యాటక శాఖ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌.
గ్రౌండ్‌ ఫ్లోర్‌: టెలికం ఆఫీస్‌, బీఎ్‌సఎన్‌ఎల్‌ సర్వర్‌ స్పేస్‌; ఏపీటీఎస్‌ సెక్రటేరియట్‌ సపోర్ట్‌ యూనిట్‌, పే అండ్‌ అకౌంట్స్‌, కన్వీనియెన్స్‌ ఏరియా (ఈసేవ, మీసేవ, రైలు, బస్సు రిజర్వేషన్‌ కౌంటర్లు, పోస్టాఫీసు, రెండు ఏటీఎంలు, వంటివి), ఉద్యోగుల పిల్లల సంరక్షణ కేంద్రం - ప్లేస్కూల్‌, ఐదు పడకల ఆస్పత్రి, వినోద-క్రీడా ప్రాంగణం (టేబుల్‌ టెన్నిస్‌, జిమ్‌, గ్రంథాలయం), రెస్టారెంట్‌.

నాల్గవ బ్లాక్:
ఫస్ట్‌ ఫ్లోర్‌: ఉన్నత విద్యాశాఖ, ఐటీ శాఖ, పాఠశాల విద్యాశాఖ, జల వనరుల శాఖ, వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి శాఖ.
గ్రౌండ్‌ ఫ్లోర్‌: వ్యవసాయం- సహకార శాఖ, పశు సంవర్ధక - మత్స్యశాఖ, పర్యావరణ-అటవీ శాఖ, రెవెన్యూ శాఖ.

ఐదవ బ్లాక్:
ఫస్ట్‌ ఫ్లోర్‌: రవాణా - ఆర్‌ అండ్‌ బీ, విజిలెన్స్‌ కమిషన్‌.
గ్రౌండ్‌ ఫ్లోర్‌: వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, హౌసింగ్‌, కార్మిక శాఖ.

English summary
Department wise floors allocated in ap temporary secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X