Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pawan Kalyan: బెజవాడ ఎందుకు వెళ్లలేదంటే -పవన్ కీలక కారణం-భారీ విరాళం..!

ఏపీలోని విజయవాడను వరదలు ముంచెత్తిన వేళ సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా అక్కడే ఉన్నారు. బాధితులకు అవసరమైన సాయం అందించే విషయంలో సమీక్షలు చేయడంతో పాటు దగ్గరుండి ఆహారం కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియలేదు. కానీ ఇవాళ ఆయనే స్వయంగా విజయవాడ ఎందుకు వెళ్లలేదో వివరించారు.

ముందుగా విజయవాడ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. దీన్ని ముఖ్యమంత్రి సహయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేసిన పవన్ కళ్యాణ్.. అక్కడే ఈ ప్రకటన చేశారు. బెజవాడలో వరద పరిస్ధితిపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు.

deputy cm pawan kalyan announced rs 1 cr aid to Vijayawada flood victims reveals reason for skip

అనంతరం తాను విజయవాడకు ఎందుకు వెళ్లలేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. విజయవాడ వరదల పరిశీలనకు వెళ్దామని అనుకుంటే.. అందరూ ఓ విషయం చెప్పారన్నారు. మీరు వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పడం వల్లే తాను విజయవాడ వెళ్లలేదన్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని తాను విజయవాడ వెళ్లలేదన్నారు. తనకు బాధితులకు సాయం చేయాలని ఉన్నా.. రిలీఫ్ ఆపరేషన్స్ కు ఇబ్బంది అవుతుందనే ఆగిపోయానన్నారు. ధైర్యం చెప్పడానికి తాను వెళ్లినప్పుడు జనం మీద పడితే అసలు ఉద్దేశమే దెబ్బతింటుందన్నారు.

విజయవాడ వరదలు ఓ ప్రకృతి విపత్తు అని, ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఈ విపత్తు దురదృష్టకరమని పవన్ తెలిపారు. బుడమేరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పటి ముప్పు అన్నారు. బుడమేరుకు సంబంధించిన నిర్వహణ పనులను గత ప్రభుత్వం చేయలేదన్నారు. అన్ని చోట్ల పడ్డ వానలు మనకు ముంపులా వచ్చాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వం ఔట్ లెట్స్ మీద దృష్టి పెట్టలేకపోయిందని, వరద తగ్గగానే ఫ్లడ్ కెనాల్స్ ఎలా ఏర్పాటు చేయాలని చర్చిస్తామని పవన్ వెల్లడించారు.

వరద బాధితుల కోసం 262 ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశామని, 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పవన్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అందరం సహాయ కార్యక్రమాలలో పని చేస్తున్నామని, 72 గంటలుగా నిద్ర కూడా లేకుండా అధికారులు అందరూ పని చేస్తున్నారని పవన్ తెలిపారు. విపత్తు తలెత్తగానే ప్రభుత్వం సత్వరమే స్పందించి ఎఫెక్టివ్ గా పని చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు, రెస్క్యూ ఆపరేషన్స్ కి తన పర్యటన ఆటంకం కారాదన్నారు. ఇప్పటి వరకు 12 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజలు సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు ఫోన్ చేయవచ్చని పవన్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+