మంత్రి లోకేశ్‌పై డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేశ్ పని తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు.

విద్యా వ్యవస్థపై ప్రభుత్వం లక్ష్యం
పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు.

Deputy CM Pawan Kalyan Praises Minister Nara Lokesh

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ కీలకం
ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణల ప్రక్రియలో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వాములను చేసేందుకు నిర్వహిస్తున్న 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ చాలా కీలకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమావేశాల్లో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంత్రిగా నారా లోకేశ్ చూపుతున్న చొరవ, అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

చిలకలూరిపేటలో పవన్ కల్యాణ్
నిన్న (శుక్రవారం-డిసెంబర్ 5) ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్' జరగడం తెలిసిందే. చిలకలూరిపేటలో జరిగిన ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకుగాను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన పవన్ కల్యాణ్, లోకేశ్‌ను పై విధంగా అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+