డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. కీలక ఆదేశం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేయడానికి ఇద్దరు ప్రయత్నం చేయడం వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తమ ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తరువాత జరిగిన ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డుల దగ్ధంపై పవన్ కళ్యాణ్ సీరియస్
విజయవాడ యనమల కుదురు కరకట్ట మీద మైనింగ్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన పలు పత్రాలు హార్డ్ డిస్క్ లు, లెటర్ హెడ్స్ మరియు క్యాసెట్స్ వంటి రికార్డులను తగలబెట్టి, ధ్వంసం చేసిన ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్ధం అయిన ఫైల్స్ , రిపోర్టుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

భద్రత కోసం ఏ విధానాలు అవలంబిస్తున్నారన్న పవన్
అంతే కాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసుల్లో రికార్డుల భద్రత కోసం ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారో చెప్పాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పీసీబీ కార్యాలయంలో రికార్డులు బయటకు ఎలా వెళ్ళాయో కూడా ఆరా తియ్యాలన్నారు. ఇదిలా ఉంటే విజయవాడలో నిన్న రాత్రి ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా పవన్ కళ్యాణ్ దీనిపై అధికారులపై సీరియస్ అయ్యారు.
కీలక రికార్డులు దగ్ధం
మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను బస్తాలలో తీసుకెళ్ళి యనమలకుదురు కట్టమీద తగలబెట్టారు ఇద్దరు యువకులు .అనుమానం వచ్చిన స్థానికులు ప్రశ్నించడంతో వచ్చిన యువకులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారిస్తున్నారు.
ఆయన ఆదేశాలతోనే రికార్డులు ధ్వంసం
పోలీసులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకు తాను ఈ పత్రాలను తగలబెట్టినట్టు రికార్డులను ధ్వంసం చేసినట్టు నాగరాజు చెప్పారు. అయితే నాగరాజు తనతో పాటు రామారావు అనే యువకుడ్ని కూడా తీసుకువెళ్లి మైనింగ్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన పత్రాలు, హార్డ్ డిస్క్ లను దగ్ధం చేశారు.
కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఫైల్స్ ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎందుకు తగలబెట్టారు? అసలు ఆ ఫైల్స్, హార్డ్ డిస్క్ లలో ఉన్న డేటా ఎంటి అన్న దాని పైన పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా వీటిని ధ్వంసం చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications