వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చినా.. అదనంగా నిధులు ఇవ్వలేం: తేల్చేసిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్ నాటి వ్యవయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్ వర్క్స్ డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ. 5535 నుంచి రూ. 719 కోట్లకు పెరిగిందని ఏపీ తమ దృష్టికి తీసుకొచ్చిందని తెలిపింది.

Recommended Video

Polavaram Project : కేంద్రం నుండి 1600 కోట్ల బిల్లులు పెండింగ్ - Ys Jagan
నిబంధనల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు..

నిబంధనల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు..

పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. గోదావరి ట్రైబ్యునల్ నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైు ఉండాలన్నారు. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు.

అదనపు నిధులు ఇవ్వలేమంటూ కేంద్రం

అదనపు నిధులు ఇవ్వలేమంటూ కేంద్రం

ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని కేంద్రమంత్రి తెలిపారు. కాపర్ డ్యామ్, పునాది పనులు, స్పిల్‌వే, డయాఫ్రం వాల్ పనులు, చిప్పింగ్, స్పిల్ వే కాంక్రీటు పనులు అదనంగా చేపట్టామని ఏపీ చెప్పినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే, ఇందు కోసం అదనంగా నిధులు కేటాయించడం కుదరదని స్పష్టం చేసింది.

వ్యవసాయ రుణాల్లో ఏపీ రెండో స్థానం, తెలంగాణ పదో స్థానం

వ్యవసాయ రుణాల్లో ఏపీ రెండో స్థానం, తెలంగాణ పదో స్థానం

దేశంలోనే వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పార్లమెంటుకు వెల్లడించారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అధిక సాగు రుణాలు తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఏపీలో మార్చి 31 నాటికి రూ. 1,69,322 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. ఏపీలోని ఒక్కో ఖాతాపై సుమారు సగటున రూ. 1,41,004 రుణం ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణ 63,22,415 ఖాతాలపై రూ. 84,005.43 కోట్ల సాగు రుణం తీసుకుంది. ఒక్కో ఖాతాపై సగటున రూ. 1,32,869 కోట్ల వ్యవసాయ రుణం ఉన్నట్లు కేంద్రమంత్రి భగవత్ కిషన్ వెల్లడించారు. .

English summary
Despite of polavaram design change, we can't give money for that says central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X