"హంటా"నే ఇంకా పోలే.. "నోరో" వైరస్ వచ్చేసింది !! రిస్క్‌లో 1,700 మంది ప్రాణాలు ?

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా వచ్చిన హంటా వైరస్ భయం ఇంకా పూర్తిగా వీడకముందే మరోసారి 'నోరోవైరస్' కలకలం రేపుతోంది. సముద్ర ప్రయాణాల్లో వరుసగా వైరస్ కేసులు వెలుగుచూడటం అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నుంచి స్పెయిన్‌కు బయలుదేరిన 'యాంబిషన్' (Ambition) క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ లక్షణాలు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో 90 ఏళ్ల వృద్ధుడు మృతి చెందడం మరింత భయాందోళనకు కారణమైంది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఫ్రాన్స్‌లో నిలిపివేసిన క్రూయిజ్ షిప్..

నౌకలో పలువురికి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో ఫ్రాన్స్ అధికారులు వెంటనే జోక్యం చేసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా నౌకను ఫ్రాన్స్ తీర ప్రాంతంలో నిలిపివేశారు. అనంతరం అందులో ఉన్న సుమారు 1,700 మంది ప్రయాణికులు, సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. ప్రస్తుతం వైద్య బృందాలు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

noro-virus-symptoms-appeared-on-ambition-cruise-ship-with-1700-passengers-and-also-one-old-man-die

50 మందిలో వైరస్ లక్షణాలు..

అధికారుల ప్రకారం, ఇప్పటివరకు దాదాపు 50 మందిలో నోరోవైరస్ లక్షణాలు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నౌకలో ప్రత్యేక శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.

నోరోవైరస్ అంటే ఏమిటి?

నోరోవైరస్ అనేది అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధి వైరస్. కలుషిత ఆహారం, నీరు లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా ఇది సులభంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా క్రూయిజ్ షిప్స్, హోటల్స్, హాస్టల్స్ వంటి మూసివేసిన ప్రదేశాల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సముద్ర ప్రయాణాలపై ఆందోళన

ఇటీవలే మరో నౌకలో హంటా వైరస్ ఘటన చర్చనీయాంశమైన నేపథ్యంలో, ఇప్పుడు నోరోవైరస్ కేసులు బయటపడటం సముద్ర ప్రయాణికుల్లో భయాన్ని పెంచుతోంది. పర్యాటక రంగంపై కూడా దీని ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరప్ దేశాలు ప్రస్తుతం సముద్ర ప్రయాణాలపై ఆరోగ్య నిబంధనలు మరింత కఠినతరం చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సూచనలు..

ప్రయాణికులు చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శుభ్రమైన ఆహారం మాత్రమే తీసుకోవడం, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు క్వారంటైన్ కొనసాగుతుందని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+