టీడీపీ నేతల చీకటి భాగోతం బయట పెడతా : టీడీపీ-జనసేన వి చిల్లర రాజకీయాలు : దేవినేని అవినాశ్..!!
టీడీపీ..జనసేన పైన వైసీపీ యువనేత దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ,జనసేన నేతలు పని పాట లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నారేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో పాలన చేస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనలో కరువుతో రాష్ట్రం అల్లాడిందని పేర్కొన్నారు. వర్షాలకు రోడ్లు పాడైపోతే వందల కోట్లతో బాగు చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో నాణ్యత లేని రోడ్డు వేశారు కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అవినాశ్ చెప్పారు.
కమిషన్లు కి కక్కుర్తి పడి నాసిరకం రోడ్లు టీడీపీ నేతలు వేయించారని..జగన్ ప్రభుత్వం లో దుర్గ గుడి ఫ్లై ఓవర్ .. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేశారని అవినాశ్ పేర్కొన్నారు. ప్రారంభించటం గొప్ప కాదు..పూర్తి చేయటం గొప్ప అని టీడీపీ నేతలు గ్రహించాలని సూచించారు. కాంట్రాక్టర్ల ఉసురు పోసుకున్నారు కాబట్టే టీడీపీ అడ్రస్ లేకుండా గల్లంతైందంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ సత్తా ఏమిటో మంగళగిరి లోనే తెలిసిపోయిందని ఎద్దేవా చేసారు. వారానికోసారి బయటకి వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపణలు పెడతాడంటూ ఫైర్ అయ్యారు.

పార్టీ ఆఫీసుల్లో కూర్చుని రాజకీయాలు చేస్తే ప్రజలు ఆ ఆఫీసు కి పరిమితం చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు.. లోకేష్ లు వాస్తవాలు తెలియాలంటే ప్రజల్లోకి రావాలని అవినాశ్ సూచించారు. జగన్ ని విమర్శించే హక్కు ఏ ఒక్క టీడీపీ నేతకు లేదన్నారు. ఎందుకు పనికి రాని దద్దమ్మలుతో కూడా విమర్శలు చేసే స్థితికి టీడీపీ దిగజారిందంటూ వ్యాఖ్యానించారు. జగన్ ని విమర్శించే టీడీపీ నేతల చీకటి భాగోతం మొత్తం బయట పెడతానంటూ హెచ్చరించారు.
రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటానికి టీడీపీ పార్టీ స్థాపిస్తే..జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చెయకుండా పారిపోయే స్థితికి చంద్రబాబు తీసుకువచ్చారంటూ వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని విమర్శించడానికి టీడీపీ నేతలు మొరుగుతున్నారని.. ఇంకోసారి పెద్దిరెడ్డి పై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామంటూ అవినాశ్ హెచ్చరించారు.
Recommended Video
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications