వైసిపి ఎందుకు స్థాపించారంటే, సవాల్: జగన్‌పై దేవినేని సంచలనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టుపై జగన్ బేరాలు
పోలవరం పనులను విద్యుత్ ప్రాజెక్టుతో కలిపి దక్కించుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావులు నాడు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపారన్నారు. కానీ, కాంగ్రెస్ పెద్దలతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదన్నారు.

బేరం కుదరకే, వైసిపి పుట్టింది
బేరం కుదరక పోవడం వల్లే జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పాలని జగన్‌కు, వైసిపి నేతలకు ఎన్నిసార్లు సవాలు విసిరినా స్పందన లేదని ఎద్దేవా చేశారు.

బొత్స విమర్శలు చేయడమా?
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతిలో మునిగిన బొత్స సత్యనారాయణ, ఇప్పుడు జగన్ పంచన చేరి పోలవరం పనులపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

మేం అధికారంలోకి వచ్చాకే
తాము అధికారంలోకి వచ్చాక కాలువలు తవ్వి నీరు పారిస్తున్నామని, పట్టిసీమ ద్వారా ఈ ఏడాది 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు అందించామని, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.7,200 కోట్లు ఖర్చు చేశామని దేవినేని చెప్పారు.












Click it and Unblock the Notifications