మూటలు మోసిన ఇంటర్నేషనల్ క్రిమినల్: కేవీపీపై దేవినేని, జగన్ రాసిపెట్టుకో..
కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావుపై మంత్రి దేవినేని ఉమ మంగళవారం తీవ్రంగా స్పందించారు. కేవీపీ ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని, మూటలు మోసిన వ్యక్తి అన్నారు.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు అంశంపై టిడిపిని, చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రశ్నించడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం తీవ్రంగా స్పందించారు. కేవీపీ ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని, మూటలు మోసిన వ్యక్తి అన్నారు.
2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే మహా సంకల్పంతో తాము ఉన్నామని, అందుకే పనులు పరుగెత్తిస్తున్నామని దేవినేని చెప్పారు. కానీ కేవీపీ మాత్రం శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
మూటలు మోసిన ఇంటర్నేషనల్ క్రిమినల్
మూటలు మోసిన వ్యక్తి, అంతర్జాతీయ క్రిమినల్ అయిన కేవీపీ పోలవరం పైన శాపనార్థాలు పెడతారా అని ధ్వజమెత్తారు. ఆయన ఎఫ్‌బీఐ ముద్దాయి అన్నారు. ఢిల్లీకి మూటలు మోసిన వ్యక్తి కేవీపీ అని ఆరోపించారు. రాయలసీమకు నీళ్లు ఇస్తే వ్యతిరేకిస్తారా అని ఆగ్రహించారు.
కేవీపీ శాపనార్థాలు పెడితే పనులు ఆగిపోతాయా అని ప్రశ్నించారు. పోలవరం పనుల పైన జగన్ కూడా ఇలాగే మాట్లాడారన్నారు. కేవీపీ సిగ్గులేకుండా వైసిపి అధినేతకు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు.

జగన్ రాసిపెట్టుకో
జగన్! రాసిపెట్టుకో.. ఎంతమందితో నీవు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపించాలని చూసినా, ఎంత మందితో పోలవరంను తిట్టించినా.. పనులు ఆగవన్నారు. మా సంకల్పాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల అక్రమాలు, అవినీతి జరిగిందన్నారు. కేవీపీకి పోలవరం పైన మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కేవీపీ అవినీతి చిట్టా బయటకు తీస్తామని దేవినేని హెచ్చరించారు. నిర్వాసితులకు పరిహారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పేద, గిరిజనుల పక్షాన తమ ప్రభుత్వం ఉందన్నారు.
ఆ పేరు చెప్పి ప్రచారం చేయను
జగన్, కేవీపీ, విజయ సాయి రెడ్డి తదితరులు కలిసి పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తున్నారన్నారు. మరో పేరు చెప్పనా.. మీకందరికీ తెలుసునని, కానీ తాను ఆ పేరు చెప్పి ప్రచారం చేయదలుచుకోలేదన్నారు.
మోడీపై ఒత్తిడి తెచ్చి..
విభజన అనంతరం... ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపాలని ప్రధాని మోడీ పైన ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ కారణంగా పోలవరం సాధ్యమవుతోందన్నారు. ముంపు మండలాలను కలపడం వల్లే ప్రాజెక్టు సాధ్యమైందన్నారు.
చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, కేవీపీకే మతిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారన్నారు. ప్రతి వారం పోలవరం వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏడుస్తారన్నారు.
పోలవరం ప్రాజెక్టు పేరుకు పేరు పైన వివాదం తీసుకు రావడం విడ్డూరమన్నారు. ఏపీలో కట్టే ప్రాజెక్టులకు జగన్మోహన్ రెడ్డి సాగర్, కేవీపీ సాగర్ అని పేరు పెట్టాలా అని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా పేరును తొలగించడంపై కేవీపీ ప్రశ్నించగా.. దేవినేని ఘాటుగా స్పందించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications