'ఏ పార్టీ లేదంటూ.. జగన్ డైరెక్షన్లో ఉండవల్లి అరుణ్ కుమార్'
మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం నిప్పులు చెరిగారు.పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబు పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
అమరావతి: మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబు పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
వైసిపి అధినేత జగన్ డైరెక్షన్లో ఉండవల్లి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తను ఏపార్టీలో చేరనని చెబుతూనే వైసిపికి అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పారు.

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలంతా పోలవరం ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. పోలవరాన్ని ఓ యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
పోలవరంపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు అవాస్తవని మండిపడ్డారు. పోలవరంపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును తాము చెప్పిన విధంగా పూర్తి చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.
Recommended Video













Click it and Unblock the Notifications