కెసిఆర్ అరెస్టుకు ఆదేశించాలి: బాబుపై నెహ్రూ, జగన్‌పై చినరాజప్ప ఫైర్
విజయవాడ/ కాకినాడ: ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడికి దమ్ముంటే ఓటుకు నోటులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, చంద్రబాబు వద్ద ట్యాపింగ్ టేపులుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అరెస్టుకు ఆదేశించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) సవాల్ చేశారు. కేసీఆర్‌ను వాటేసుకున్నప్పుడు సెక్షన్ 8 గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.
సెక్షన్ 8ని తప్పనిసరిగా అమలు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దానితోపాటు, సెక్షన్ 94 సబ్ క్లాజు 4ని కూడా అమల్లోకి తీసుకొచ్చి రాజధాని నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని అవసరాల కోసం అటవీ భూములను వినియోగించుకోవచ్చునని సెక్షన్ 94 సబ్ క్లాజు 4 చెబుతున్నదని, దానివల్ల రాజధానిలో భూమిలేని నిరుపేదలకు అమరావతి నుంచి అచ్చం పేట వరకు ఉన్న అటవీ భూములను ఒక్కో కుటుంబానికి హెక్టారు చొప్పున ఇచ్చే వీలుందని ఆయన అన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొడతామని హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం లో ఆదివారం ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం విజయోత్సవ యాత్ర జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడుతుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్ కేసీఆర్‌తో కలిసి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజధాని సేకరణకు చంద్రబాబు 33 వేల ఎకరాల భూమి సేకరించారని, దానిని కూడా జగన్ రాజకీయం చేయడం దారుణమన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications