అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ సొంత ఇల్లు, కాంగ్రెస్ అద్దె ఇల్లు: వేరే జెండా ఎత్తడం ఇష్టం లేదన్న దేవినేని

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీడీపీలో చేరనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిశారు.

మంగళవారం ఉదయం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలసి దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో వారంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు ప్రకటించారు.

మరో పది రోజుల్లో టీడీపీలో చేరుతామని చంద్రబాబుకు స్పష్టం చేసిన దేవినేని, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నలుగురం మాత్రమే ఉన్నామని, అందులో తానొక్కడని దేవినేని నెహ్రూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతి చిన్న పాయింట్ లో తాను భాగస్వామినని చెప్పుకొచ్చారు. టీడీపీ కొత్త పార్టీలా లేదని, నా సొంత ఇల్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మాత్రం అద్దె ఇల్లులా ఫీల్ అయ్యానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చానని చెప్పిన దేవినేని నెహ్రూ వేరే జెండా ఎత్తడం ఇష్టం లేకే టీడీపీలోకి చేరినట్టు తెలిపారు. పార్టీ తనకు కన్నతల్లితో సమానమని, పార్టీ నుంచి తానేమి ఆశించడం లేదని, పార్టీకి ఏం చేయగలుగుతానో అది మాత్రమే చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా తనకేమీ తక్కువ చేయలేదని, కానీ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే సమయంలో రెండు గంటలు బాధపడ్డానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏం చేయగలిగానో అది చేశానని అన్నారు. తన కుమారుడైన దేవినేని అవినాష్‌కు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి ఇచ్చిందని అన్నారు.

తాను పార్టీ మారితే కాంగ్రెస్ నేతలు బాధపడి ఉండొచ్చని, కానీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. సెప్టెంబర్ 15న తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎవరినీ చేయి చాచి అడగలేదని తెలిపారు.

తనది పార్టీలు మారే మనస్తత్వం కాదు

తనది పార్టీలు మారే మనస్తత్వం కాదు

తనది పార్టీలు మారే మనస్తత్వం కాదని అన్నారు. టీడీపీలో కూడా తాను ప్రూవ్ చేసుకుంటానని తెలిపారు. అవినాష్‌కు టీడీపీ కొత్త పార్టీ అవుతుందని, ఎందుకంటే ఇప్పటి వరకు తను ఓ వ్యవస్థలో పనిచేసి ఏకవర్త పార్టీలోకి వస్తున్నాడని ఆయన అన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నామని చె��్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నెహ్రూ గంట సేపు చర్చలు జరిపారని తెలిపారు. తనతో పాటు విజయవాడ కాంగ్రెస్ ఇన్ చార్జి కడియాల బుచ్చిబాబు కూడా రాజీనామా సమర్పించారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తామని చెప్పారు.

కళా వెంకట్రావుతో కలిసి చంద్రబాబు నివాసానికి

కళా వెంకట్రావుతో కలిసి చంద్రబాబు నివాసానికి

తన అనుయాయులు, కార్యకర్తలతో చర్చించిన తరువాతే కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు దేవినేని పేర్కొన్నారు. దేవినేనిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కళా వెంకట్రావు తెలిపారు. దేవినేని నెహ్రూ టీడీపీలో చేరే అంశంపై ఇప్పటికే కసరత్తు ముగిసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన దేవినేని నెహ్రూ 1995లో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

టీడీపీలో చేరాలని నిర్ణయం

టీడీపీలో చేరాలని నిర్ణయం

అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని భావించి టీడీపీలో చేరుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. టీడీపీలోకి చేరడంపై దేవినేని నెహ్రూ తన నివాసంలో అనుచరులు, అభిమానులతో భేటీ అయి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీలోకి చేరాలని నిర్ణయ���ంచుకున్నారు. అయితే చంద్రబాబు భేటీలో దేవినేని నెహ్రూ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసమే

దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసమే

ప్రస్తుతం ఏపీ యవజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దేవినేని నెహ్రూ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ భేటీలో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై చం��్రబాబు నుంచి హామీ తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. మంగళవారం చంద్రబాబుతో దేవినేని నెహ్రూ సమావేశమైనప్పటికీ, వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం తన అనుచరులు, మద్దతుదారులతో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

English summary
Congress senior leader Devineni nehru meets chandrababu naidu in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X