వైయస్ చనిపోయిన రోజు జగన్ ఏం చేసారంటే: దేవినేని నోట కొత్త విషయం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజునే.. తండ్రి శవం పక్కనుండగానే పోలవరం పనుల టెండర్ అప్ లోడ్ చేశాని సంచలన ఆరోపణ చేశారు.

దేవినేని కొత్త ఆరోపణ

దేవినేని కొత్త ఆరోపణ

వైయస్ శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం కావడానికి జగన్ సంతకాలు చేయించాలనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు దేవినేని మరో ఆరోపణ చేశారు.

జగన్! ఎందుకు ఈ ప్రయత్నాలు

జగన్! ఎందుకు ఈ ప్రయత్నాలు

అదే జగన్ ఇప్పుడు పోలవరం పనులు ఆపడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలని దేవినేని నిలదీశారు. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా స్పిల్ వే పనులు ఎందుకు ఫ్రీక్లోజర్ చేశారో చెప్పాలన్నారు.

ఎన్ని కోట్లకు బేరం పెట్టారో చెప్పగలను

ఎన్ని కోట్లకు బేరం పెట్టారో చెప్పగలను

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పవర్ హౌస్ పనులు చేజిక్కించుకోవాలని ఆయన చనిపోయిన రోజునే అప్ లోడ్ చేశారన్నారు. అవసరమైతే దీనిపై ఎన్ని కోట్లకు బేరం పెట్టారో కూడా తాను చెప్పగలనని అన్నారు.

సమాధానం చెప్పు

సమాధానం చెప్పు

పోలవరం నిర్మాణ పనులు ఆపాలన్న లక్ష్యంతో కోట్లు ఖర్చు చేసి నేషనల్ ట్రైబ్యునల్ వంటి వాటిల్లో కేసులు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి గర్భం నుంచి తీసిన మట్టిలో విషపదార్థాలున్నాయని మరో కేసు వేశారన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు పనులు ఆగవని, కేసులపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Devineni Umamaheswara Rao on Saturday lashed out at YSRCP chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...