ఆఫీస్ బాబుకే ఇచ్చేశా: 'హైద్రాబాద్ టు బెజవాడ'పై దేవినేని కష్టాలు
విజయవాడ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఉద్యోగులు నవ్యాంధ్ర రాజధానికి తరలుతున్నారు. మంత్రులు ఏపీ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. అయితే, అందరికంటే ముందు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బెజవాడ నుంచి పరిపాలన ప్రారంభించారు.
జగన్ రోగానికి మందుల్లేవ్, వదలం: దేవినేని, సాక్షిలో వచ్చేవన్నీ అవే: బాబు
ఇప్పుడు, మంత్రులు, ఉద్యోగులు అందరూ బెజవాడ తరలారు. ఇప్పుడు దేవినేని శాఖ సిబ్బంది అమరావతికి తరలింది. అందరికంటే ముందు బెజవాడ నుంచి పరిపాలన చేస్తున్న దేవినేని తనకు ఎదురైన ఇబ్బందులను ఎకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.

విభజన నేపథ్యంలో మనది కాని రాష్ట్రంలో ఉండకూడదని, కార్యకర్తలకు, ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉండాలని విజయవాడ వచ్చానని, నేను అనుకుంటే హైదరాబాదులోనే పెద్ద బంగ్లాలో ఉండవచ్చునని, కానీ, ఇక్కడకు వచ్చి రెండు పడక గదుల ఇంటిలో ఉన్నానని చెప్పారు.
రెండు గదుల కార్యాలయం నుంచి పాలన చేశానని, కార్యాలయం లేక బస్సులోనే ఉంటున్న ముఖ్యమంత్రికి తన కార్యాలయాన్ని ఇచ్చానని, తనకు ప్రత్యేకంగా కార్యాలయం కూడా లేకుండా పోయిందని, తనను కలిసేందుకు వచ్చే వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక పొద్దున్నే ఎనిమిది గంటలకే లేచి ఆరు నెలల పాటు పొలం గట్ల వెంబడి తిరిగానని, మేము ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు.
హైద్రాబాద్ టు అమరావతి.. అరగంటకో బస్సు: హైదరాబాద్ వెలవెల!
కానీ ఉద్యోగులకు మాత్రం సకల సౌకర్యాలు కల్పించిన తర్వాతే తరలిస్తున్నామని, అనుకున్న విధంగా ఉద్యోగులు వస్తుంటే సందడి వాతావరణం నెలకొందని మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కాగా, విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పాలన వద్దనుకున్న సీఎం చంద్రబాబు, మంత్రులు ఒక్కరొక్కరిగా విజయవాడ వెళ్లారు. ఉద్యోగులకు డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications