'ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైయస్ జగన్‌కు అభ్యర్థులు కూడా దొరకరు'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.

వైయస్ చనిపోయిన రోజు జగన్ ఏం చేసారంటే: దేవినేని నోట కొత్త విషయం

బుగ్గవాగు పనులు నెల రోజుల్లోగా ప్రారంభిస్తామని దేవినేని తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. గోదావరి- పెన్నా అనుసంధానంతో పల్నాడుకు గోదావరి నీరు అందిస్తామని చెప్పారు.

Devineni says no one will contest from YSRCP after completing Polavaram project

బొల్లాపల్లి రిజర్వాయర్‌కు గోదావరి నీటి తరలింపునకు ప్రణాళిక వేశామన్నారు. రాయలసీమకు గోదావరి నీరందించి కరువును ఎదుర్కొన్నామని వెల్లడించారు. 2018నాటికి పోలవరం ఎడమకాలువ ద్వారా విశాఖకు నీరు అందిస్తామన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని దేవినేని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Devineni Umamaheswara Rao said that no one will contest from YSRCP after completing Polavaram project.
Please Wait while comments are loading...