వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్.. 34నెలల్లో మీరేం చేశారు? అబద్ధాలతో ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారు?

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రం తిరోగమనంలో నడుస్తుందని దేవినేని ఉమా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు జేబులను కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ సంపద సృష్టించటంపై పెట్టడం లేదంటూ విమర్శలు చేశారు. ఇక ఇదే సమయంలో కడప ఉక్కు పరిశ్రమపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.

జగన్ సొంతఊరు పులివెందులలోనే నాటుసారా బట్టీలు; వీడియో పోస్ట్ చేసి లోకేష్ సూటిప్రశ్నజగన్ సొంతఊరు పులివెందులలోనే నాటుసారా బట్టీలు; వీడియో పోస్ట్ చేసి లోకేష్ సూటిప్రశ్న

కడప ఉక్కు పరిశ్రమ మూడేళ్ళయినా పునాది రాయి దాటలేదు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పునాది రాయి దాటని కడప ఉక్కుపరిశ్రమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ పనుల్లో పురోగతి లేదని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులు తప్ప ఖర్చుపెట్టింది శూన్యం అంటూ విమర్శలు గుప్పించారు దేవినేని ఉమ. వైసీపీసర్కార్ తీరుతో రాష్ట్రంలోని కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఉక్కుకు మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప ముప్పై నాలుగు నెలల్లో మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా వైయస్ జగన్ అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.

పన్నుల భారం మోపటంలో జగన్ సర్కార్ కొత్త పుంతలు

అంతేకాదు పన్నులభారం మోపడంలో వైసిపి సర్కస్ కొత్తపుంతలు తొక్కుతుందని ఆరోపించారు. 2వారాల్లో వెయ్యికోట్ల ఆస్తి,చెత్తపన్ను వసూలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రైతుల నుండి 650కోట్ల నీటితీరువా 6%వడ్డీతో వసూలుకు ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. ఒక్కఛాన్స్ ఇచ్చిన ప్రజలజేబులు కొల్లగొట్టడంపై పెట్టినశ్రద్ధ సంపద సృష్టించడంపై పెట్టొచ్చుకదా? వైయస్ జగన్ అంటూ ప్రశ్నించారు దేవినేని ఉమా.

అబద్ధాలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారు?

అబద్ధాలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారు?


అంతకుముందు రూ.200 ల పెన్షన్ ను ఐదేళ్లలో పదిరెట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదని పేర్కొన్న దేవినేని ఉమా నెలకు 2వేల చొప్పున 51లక్షలమందికి పైగా పంపిణీ చేశారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే 3000 ఇస్తామని ప్రజలను ఘోరంగా మోసంచేశారని దేవినేని ఉమా ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయల ప్రజాధనంతో తప్పుడు ప్రకటనలు ఇచ్చారని దేవినేని ఉమ మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజలను ఇంకెంత కాలం మోసంచేస్తారు? వైయస్ జగన్ అంటూ దేవినేని ఉమా జగన్ కు ప్రశ్నాస్త్రాలు సంధించారు.

విద్యాదీవెనలో వైసీపీ సర్కార్ మోసం .. తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు?

విద్యాదీవెనలో వైసీపీ సర్కార్ మోసం .. తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు?


విద్యాదీవెనలో వైసీపీసర్కార్ మోసం చేసిందని 650కోట్లు ఎగ్గొట్టిందని దేవినేని ఉమ మండిపడ్డారు. 2020-21 నాలుగోవిడత చెల్లించకుండా.. 2021-22 మొదటివిడత చెల్లింపులా? ఆ మొత్తం విద్యార్థులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయని దేవినేని ఉమ పేర్కొన్నారు . ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులకు ఏం సమాధానంచెప్తారు? వైయస్ జగన్ అంటూ దేవినేని ఉమా నిలదీశారు.

English summary
Devineni Uma has criticized Chief Minister Jaganmohan Reddy for not focusing on creating wealth in AP. Devineni Uma fired YS Jagan deceived people for a long time with lies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X