జగన్ కు దేవినేని ఉమా సవాల్: దమ్ముంటే ఆ పేర్లు బయట పెట్టండి: జగన్ ఓటమి అంగీకరించారు..!
Recommended Video
వైసిపి అధినేత జగన్ పై టిడిపి నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఒకే సామాజిక వర్గానికి చెందిన 40 మంది డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చిందని ఆరోపిస్తున్న జగన్ దమ్ముంటే ఆ పేర్లు బయట పెట్టాలని సవాల్ చేసారు. ఈ నెల 11వతేదీ సాయంత్రమే జగన్ ఓటమిని అంగీకరించారని ఉమా వ్యాఖ్యానించారు.
జగన్ కు దమ్ముంటే బయట పెట్టాలి..
టిడిపి నేత దేవినేని ఉమా వైసిపి అధినేత జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకర స్థాయి లో ఉందన్నారు. లోటస్ పాండ్ లో సీయం అంటేనే జగన్ పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. 11వ తేదీ పోలింగ్ ముగిసిన తరువాత జగన్ తన వ్యాఖ్యల్లోనే ఓటమిని అంగీకరించారని..ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పుకొచ్చారు. ఇక, గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రభుత్వం 40 మందికి డీఎఎస్పీ ప్రమోషన్లు ఇస్తూ.. ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారంటూ ఆరోపిస్తున్న జగన్..ఆయనకు దమ్ము..ధైర్యం ఉంటే ఆ 40 మంది పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేసారు. వారి సామాజిక వర్గాలను బహిర్గతం చేయాలన్నారు. జగన్ ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారని ఉమా ఆరోపించారు.

క్రిమినల్ మైండ్ వైసిపిదే..
కోడెల శివప్రసాద్ పైన జగన్ చేసిన వ్యాఖ్యల మీదా ఉమా స్పందించారు. కోడెలే చొక్కా చింపుకున్నారని అన్నారని.. చొక్కాలు చింపుకోవటం క్రిమినల్ మైండ్ ఉన్న వైసిపి నేతలకే ఉంటుందన్నారు. జగన్ గవర్నర్‌ను కలిసి అబద్దాలు చెప్పారని విమర్శించారు. బిజెపి సహకారంతో జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎస్..ఎస్పీలను ఎన్నికల సంఘం అక్రమంగా బదిలీ చేస్తే ఈ రిటైర్డ్ అధికారులు ఏమయ్యారని ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారులు ఎందుకు నోరు మెదపలేకపోయారని నిలదీసారు. హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని..ఆర్దిక ఉగ్రవాది పక్కన చేరి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications