ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి డీజీపీ, సీఎస్ వివరణాత్మక నివేదిక.. ఏం చెప్పారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏపీ సి ఎస్ జవహర్ రెడ్డి డిజిపి హరీష్ కుమార్ గుప్తాలు వివరణ ఇవ్వాలని ఈసీ ఢిల్లీకి వారిని పిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరైన ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికలలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు.
ఏపీలో హింసపై ఈసీ సీరియస్
వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట, తదితర ప్రాంతాలలో చెలరేగిన హింసపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగలబెట్టడం వంటి అనేక ఘటనలు చోటు చేసుకుంటే ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ వారిని నిలదీసింది.

ఈసీకి వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ
పరిస్థితి అంత దారుణంగా తయారైతే అదుపు చేయకుండా ఏం చేస్తున్నారంటూ ఈసీ ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరు అంటూ ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వివరణ ఇచ్చిన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డిజిపి హరీష్ కుమార్ గుప్తా దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు ఎన్నికల సంఘానికి ఏపీలో జరిగిన ఘటనలు, వాటిని అదుపు చేయడానికి తాము తీసుకున్న చర్యలపైన వివరణ ఇచ్చారు.
నివేదికలు అందించిన సీఎస్, డీజీపీ
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశాలు జారీచేసినా, అధికారులు పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరించారని ఎన్నికల కమిషన్ వీరి పైన మండిపడినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగిన ఘటనలు, తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలను ఏపీ సీఎస్, డీజీపీలు నివేదిక రూపంలో ఎన్నికల సంఘానికి అందించారు.
ఇంటిలిజెన్స్ సమాచారం లేదా? ఏర్పాట్లు చేసుకోలేదా?
అంతేకాదు ఎన్నికల పోలింగ్ రోజున, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల పైన ఆరా తీసిన ఎన్నికల సంఘం అధికారులు ముందస్తుగా ఉండే ఇంటిలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారని, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసినట్టు తమ దృష్టికి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈసీ తదుపరి చర్యలపై ఆసక్తి
అభ్యర్థుల పైన దాడులు చేస్తుంటే ఎందుకు తగిన విధంగా స్పందించడం లేదని ఈసీ వివరణ కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈసీ అడిగిన అన్ని ప్రశ్నలకు సీఎస్, మరియు డీజీపీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈసీకి వివరణ ఇచ్చిన అధికారులపై ఈసీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications