హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బయటపడ్డట్టే!: జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మాన, గీతా రెడ్డిలకు ఊరట

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు, అధికారులకు ఒక్కొక్కరికి ఊరటనిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వరుసగా ఉత్తర్వులను జారీ చేస్తోంది.

తాజాగా ఈ కేసులో జరిగిన విచారణ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రులుగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డిలతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్‌ లకు ఊరట లభించింది.

dharmana prasada rao and geeta reddy got relief in ys jagan case

ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ సంస్ధల్లో పెట్టుబడులకు సంబంధించి వీరంతా వాన్‌పిక్, లేపాక్షి నాలెజ్డ్ హబ్, ఇండియా సిమెంట్స్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన సంగతి తెలిసిందే.

English summary
The High Court on Wednesday granted relief to former ministers Dharmana Prasada Rao, J Geetha Reddy and retired IAS officer Samuel by exempting their personal appearance in the special CBI court here in connection with the disproportionate assets case of YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X