ధర్మవరం సీఐ తల్లిని ఇంత దారుణంగా హత్య చేశారా ?, కొడుకు లాంటివాడు
ఒక పోలీస్ అధికారి తల్లిని హత్య చేసి ఆమె శవాన్ని పూడ్చిపెట్టేసి ఆ కేసు నుండి తప్పించుకోవాలని ప్రయత్నించడం ఆంధ్రప్రదేశ్ లో కలకలం లేపుతుంది. కొడుకు లాంటి వాడని ఎంతో నమ్మి ఇంటికి పిలిపించుకున్న వ్యక్తి పోలీసు అధికారి తల్లిని హత్య చేశాడు. కొడుకు లాంటి వ్యక్తి నగలు, నగదు కోసం ఓ పోలీసు అధికారిని హత్య చేయడం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో కలకలం రేపింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోని జగనన్న కాలనీలో హత్యకు గురైయ్యింది. ఒక పోలీస్ అధికారి తల్లి హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కలికిరి మండలంలోని మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త రెండో వివాహం చేసుకోవడంతో ఆయనతో విడిపోయిన ఆమె చాలా సంవత్సరాల క్రితం కుమారుడు నాగేంద్ర ప్రసాద్ తో కలిసి మదనపల్లె చేరుకుంది.

ఎంతో కష్టపడిన స్వర్ణకుమారి ఆమె కుమారుడు నాగేంద్ర ప్రసాద్ ను బాగా చదివించింది. మదనపల్లెలోని బీటీ కళాశాలలో చేరిన నాగేంద్ర ప్రసాద్ హాకీ క్రీడాకారుడిగా సత్తా చాటుకున్నాడు. బీటీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో నాగేంద్ర ప్రసాద్ క్రీడా పోటీలో పాల్గొనేవాడు. ఆ తరువాత నాగేంద్ర ప్రసాద్ క్రీడా కోటాలో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేశాడు.
ప్రస్తుతం ధర్మవరం వన్ టౌన్ సీఐగా పని చేస్తున్న నాగేంద్ర ప్రసాద్ అక్కడే నివాసం ఉంటున్నాడు. మదనపల్లెలోని జగనన్న కాలనీలో సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణ కుమార్ కి సొంత ఇల్లు ఉంది. కొంతకాలం ధర్మవరం లోని కుమారుడు నాగేంద్రప్రసాద్ ఇంటిలో ఉంటున్న స్వర్ణకుమారి కొన్ని రోజులు మదనపల్లెలోని జగనన్న కాలనీలోని ఆమె సొంత ఇంటిలో ఉంటోంది. సొంత ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఇల్లు పాడైపోతుందని అనుకున్న స్వర్ణకుమారి కొన్ని రోజులు మదనపల్లెలోనే ఉంటోంది.
స్వర్ణకుమారి సొంత ఊరు అయినా మేడికుర్తికి చెందిన సురేంద్ర, లక్ష్మమ్మ దంపతులు అదే జగనన్న కాలేజీలో నివాసం ఉంటున్నారు. సురేంద్ర, లక్ష్మమ్మ కుమారుడు వెంకటేష్ కూడా అక్కడే ఉంటున్నాడు. సొంత ఊరు కావడంతో లక్ష్మమ్మ కుటుంబ సభ్యులతో సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తోంది. కుమారుడు దూరంగా ఉండడంతో స్వర్ణకుమారి ఏమైనా అవసరమైన వస్తువులను వెంకటేష్ దగ్గర తెప్పించుకునేది. వెంకటేష్ ను సొంత కుమారుడిలాగా చూసుకున్న స్వర్ణకుమారి అతనికి అవసరమైనప్పుడు డబ్బులు కూడా ఇచ్చేదని తెలిసింది.
స్వర్ణ కుమారి దగ్గర భారీ మొత్తంలో నగలు, నగదు ఉన్నాయని తెలుసుకున్న వెంకటేష్ ఆమెను హత్య చెయ్యాలని ప్లాన్ చేశాడు. మదనపల్లెలోని నీరుగట్టి వారిపల్లెలోని సాయిరాం వీధిలో నివాసం ఉంటున్న అనీల్ అనే వ్యక్తిని కలుపుకొని స్వర్ణకుమారుని హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈనెల 28వ తేదీన కాశీ నుండి స్వామీజీ వచ్చాడని, ఆయన దగ్గర చూపించుకుంటే అనారోగ్యం బాగ అవుతుందని, మీరు ముందుముందు అనారోగ్యానికి గురికాకుండా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని వెంకటేష్ సీఐ తల్లి స్వర్ణకుమారికి మాయమాటలు చెప్పాడు.
ఆ తర్వాత స్వర్ణకుమారిని పిలుచుకుని వెళ్లి ఆమెకి మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చారు. మత్తులో ఉన్న స్వర్ణకుమారి తలపై సుత్తితో కొట్టి హత్య చేశారు ఆమె దగ్గర ఉన్న నగలు మొత్తం దోచుకున్నారు. స్వర్ణ కుమారి శవాన్ని గోనె సంచిలో కట్టేసి మదనపల్లెలోని అయోధ్య నగర్ లోని స్మశాన వాటికలో ఓ సమాధి తీసి అందులో పూడ్చి పెట్టేశారు. స్వర్ణ కుమారి దగ్గర ఉన్న నగలు మదనపల్లెలోని ఓ ఫైనాన్స్ సంస్థలో కుదవ పెట్టి రూ 4.30 లక్షల నగదు తీసుకున్నారు. ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ అతని తల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడంతో మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గత పది రోజుల నుండి మదనపల్లె, ధర్మవరం పోలీసులు స్వర్ణకుమారి కోసం గాలించారు. చివరికి వెంకటేష్ పైన అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. అయెధ్య నగర్ లోని స్మశానవాటికలో గోతి తీసి స్వర్ణకుమారి మృతదేహాన్ని బయటకు తీశారు. సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి హత్యకు గురికావడంతో మదనపల్లెతో పాటు ధర్మవరంలో ప్రజలు హడలిపోయారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్య కుమార్ ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ కు ఫోన్ చేసి మాట్లాడారని తెలిసింది.
-
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications