కాకాణిని కాపాడేందుకే, ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారు: నెల్లూరు కోర్టులో చోరీపై ధూళిపాళ్ల నరేంద్ర

అమరావతి: నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా? అని ప్రశ్నించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో వేల కేసులు ఉంటే కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా? అని నిలదీశారు.

కాకాణిని కాపాడేందుకే అనుమానితుల అరెస్ట్: ధూళిపాళ్ల

కాకాణిని కాపాడేందుకే అనుమానితుల అరెస్ట్: ధూళిపాళ్ల

నెల్లూరు కోర్టులో చోరీ వెనుక పెద్దల హస్తముందని.. ధూళిపాళ్ల నరేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులో చోరీ.. న్యాయవ్యవస్థకే మాయని మచ్చ అని అన్నారు. చోరీపై పోలీసులు కథలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసు కొనసాగితే కచ్చితంగా కాకాణికి జైలు శిక్ష తథ్యమన్నారు. ఈ ఘటనపై సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాకాణిని కాపాడేందుకే అనామకులను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

నెల్లురు కోర్టు చోరీ కేసులో పెద్దల ఆశీర్వాదం: ధూళిపాళ్ల నరేంద్ర

నెల్లురు కోర్టు చోరీ కేసులో పెద్దల ఆశీర్వాదం: ధూళిపాళ్ల నరేంద్ర

నెల్లూరు కోర్టులో చోరీ అనేది.. న్యాయవ్యవస్థకే మాయని మచ్చ. కోర్టులో గది తలుపులు పగలగొట్టి ఏం తీసుకోలేదంటున్నారు. కోర్టులో ఉన్న సాక్ష్యాలే చోరీకి గురయ్యాయంటే ఏం చెప్పాలి? ఎవరి ప్రమేయం లేకుండానే చోరీ జరిగిందా? ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం లేకుండానే ఈ చోరీ జరిగిందంటారా? వేల కేసులు ఉన్న నెల్లూరు కోర్టులో కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పత్రాలే చోరీకి గురయ్యాయి. మంత్రిగా ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే అనామకులను తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై న్యాయమూర్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.

మంత్రి ఇంట్లో వ్యక్తి మృతిపై ధూళిపాళ్ల ఆరోపణలు

మంత్రి ఇంట్లో వ్యక్తి మృతిపై ధూళిపాళ్ల ఆరోపణలు

కోర్టులో చోరీ కేసులో పోలీసులు, కోర్టు ఉద్యోగుల ప్రమేయం ఉందా? అనేదానిపై విచారణ జరపాలన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. చోరీ కేసుకు.. ఏసీ మెకానిక్‌ షేక్‌ మహమ్మద్‌ మృతికి సంబంధం ఏంటో తెలియాలని ప్రశ్నించారు. మహమ్మద్‌ మృతిపై చాలా అనుమానాలున్నాయని, ఆఖరికి దొంగతనాలు చేయించే స్థాయికి వచ్చారంటే ఏమనాలని నిలదీశారు. ఐరన్‌ చోరీ కోసం వచ్చిన వాళ్లకు కోర్టు తాళాలు పగలగొట్టాల్సిన పనేంటని ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదన్న ధూళిపాళ్ల.. కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి, సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణ జరిగితేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.

నెల్లూరు ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారు: ధూళిపాళ్ల నరేంద్ర

నెల్లూరు ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారు: ధూళిపాళ్ల నరేంద్ర

కాకాణి మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఇంత అరాచకమా? అని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ఏడు కేసుల్లో కాకాణి ముద్దాయిగా ఉన్నారని.. సోమిరెడ్డి ప్రతిష్ఠ దిగజార్చాలని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో కాకాణి గోవర్దన్‌రెడ్డి ఏ1గా ఉన్నారు. నెల్లూరు ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా..? కోర్టులో వేల కేసుల పత్రాలు ఉంటే.. కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా? అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా ఈ చోరీ జరిగే అవకాశం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+