వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖ‌చ్చితంగా ఏపికి వెళ్తా : ఎవ‌రైనా ఏపికి రావ‌చ్చు : ఇద్ద‌రు చంద్రుల డైలాగ్ వార్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఏపి-తెలంగాణ ముఖ్య‌మంత్రుల మ‌ధ్య ప‌రోక్ష మాట‌ల యుద్దం సాగుతోంది. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారానికి చంద్ర‌బాబు వ‌చ్చి త‌న‌కు గిఫ్ట్ ఇచ్చార‌ని..తాను ఏపికి వెళ్లి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ తెలంగాణ సీయం కెసిఆర్ చేసిన కామెంట్ల ఏపి లో రాజకీయంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కెసిఆర్ వ్యాఖ్య‌ల మీద ఏపి సీయం చంద్ర‌బాబు సైతం స్పందించారు. దీంతో..ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల డైలాగ్ వార్ ఆస‌క్తి క‌రంగా మారింది..

Recommended Video

Telangana Election Results : KCR Makes Fun On Chandrababu Naidu For Praising Modi | Oneindia Telugu

తెలంగాణ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌రువాత కెసిఆర్‌..ఏపి ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నాయి. ఏపి రాజ‌కీయాల్లో క‌ల‌గ‌చేసుకుంటాన‌ని..చంద్ర‌బాబు త‌న‌కు గిఫ్ట్ ఇచ్చిన‌ప్పుడు..తాను కూడా తిరిగి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాలి క‌దా..ఖ‌చ్చితంగా ఇస్తానంటూ కెసిఆర్ కామెంట్ చేసారు. దీని పై ఏపిలోని టిడిపి నేత‌లు పెద్ద‌గా స్పందించ‌లేదు. అయితే, ప్ర‌కాశం జిల్లా ఒంగోలు లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..ఈ వ్యాఖ్య‌ల పై స్పందించారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు.. రావొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చంటూ చంద్ర‌బాబు కెసిఆర్ వ్యాఖ్య‌ల పై స్పందించారు.

Dialogue war between AP and Telangana Chief Ministers : Return Gift make politcial heat..

ఇదే స‌మ‌యంలో టిఆర్‌య‌స్ శాస‌న‌స‌భా ప‌క్షం కెసిఆర్ ను త‌మ పార్టీ లీడ‌ర్ గా ఎన్నుకుంది. ఈ సంద‌ర్భంలో మీడియా తో మాట్లాడిన కెసిఆర్ మ‌రో సారి ఏపి పై కామెంట్లు చేసారు. తాను ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకుంటానని చెప్పిన మాటలను మరోసారి ఉద్ఘాటించారు కేసీఆర్. తనను ఆంధ్రాకు రమ్మని పిలుస్తున్నారని, వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానని ఆయన అన్నారు. ఇలా.. కెసిఆర్ వ్యాఖ్య‌లు..దీనికి ప్ర‌తిగా చంద్ర‌బాబు స్పంద‌న తో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. కెసిఆర్ తాను ఏపి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటాన‌ని ప‌దే ప‌దే చెబుతుండ‌టంతో..రాజ‌కీయ విశ్లేష‌కులు ఏం జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే అంశం పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు...

English summary
TDP and TRS chiefs Dialogue war continue. KCR repeated his entry in AP politics surely. At the same time TDP chief Chandra Babu also reacted on KCR Comments. Babu tole Any body can go any where in democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X